ఈ మొదటి సేల్ లో 1,50,000 యూనిట్లను విక్రయించింది దీంతో పాటు ఇప్పుడు పోకో ఎం3 సేల్ కేవలం 45 రోజుల్లో 5లక్షల కొనుగోళ్ళు దాటినట్లు కంపెనీ పేర్కొంది. పెద్ద డిస్ ప్లే, ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 6000 ఎంఏహెచ్ బ్యాటరీతో పోకో ఎం3 భారత మార్కెట్లో విడుదలైంది. ఈ ఫోన్ ప్రత్యేకతలెంటో తెలుసుకుందాం ...
undefined
భారతదేశంలో పోకో ఎం3 ధరభారతదేశంలో పోకో ఎం3 ప్రారంభ ధర రూ .10,999. ఈ ధర వద్ద 64 జీబీ స్టోరేజ్ 6 జీబీ ర్యామ్‌తో లభిస్తుండగా, 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ .11,999. మీరు ఐసిఐసిఐ బ్యాంక్ కార్డుతో లేదా ఫోన్‌ను ఇఎంఐలో కొనుగోలు చేస్తే మీకు రెండు మోడళ్లపై రూ .1000 రిబేటు లభిస్తుంది. పోకో ఎం3 కూల్ బ్లూ, పోకో ఎల్లో, పవర్ బ్లాక్ కలర్ వేరియంట్లలో లభిస్తుంది.
undefined
పోకో ఎం3 స్పెసిఫికేషన్లుఈ ఫోన్‌కు డ్యూయల్ సిమ్ సపోర్ట్‌తో ఆండ్రాయిడ్ 10 బేస్డ్ ఎంఐయూఐ 12 లభిస్తుంది. అలాగే 1080x2340 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో 6.53 అంగుళాల ఫుల్ హెచ్‌డి ప్లస్ డిస్‌ప్లే ఉంది. డిస్ ప్లేకి గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ ఇచ్చారు. ఈ ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 662 ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్, 64128 జీబీ వరకు స్టోరేజ్ లభిస్తుంది.
undefined
పోకో ఎం3 కెమెరాకెమెరా విషయానికొస్తే ఈ పోకో ఫోన్‌లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది, దీనిలో ప్రైమరీ లెన్స్ 48 మెగాపిక్సెల్స్ తో ఎపర్చరు ఎఫ్ 1.79. రెండవ లెన్స్ 2 మెగాపిక్సెల్ మాక్రో తో ఎపర్చరు f2.4, మూడవ లెన్స్ 2 మెగాపిక్సెల్స్ డెప్త్ సెన్సార్ కెమెరా దీని ఎపర్చరు f2.4. ఈ ఫోన్‌లో సెల్ఫీ కోసం 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంది.
undefined
పోకో ఎం3 బ్యాటరీఈ పోకో ఫోన్ లో కనెక్టివిటీ కోసం 4జి ఎల్‌టిఇ, వై-ఫై, బ్లూటూత్, జిపిఎస్ ఎ-జిపిఎస్, యుఎస్‌బి టైప్-సి, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ ఉన్నాయి. ఫోన్ పవర్ బటన్‌లో ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇచ్చారు. దీనికి 6000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, 18 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్ తో వస్తుంది. ఫోన్ బరువు 198 గ్రాములు. ఫోన్‌లో స్టీరియో స్పీకర్ ఉంది.
undefined