మీ ఫోన్‌లో ఈ 8 యాప్స్ ఉంటే వెంటనే డిలెట్ చేయండి.. లేదంటే మీ బ్యాంక్ అక్కౌంట్ హ్యాక్ కావొచ్చు..

First Published Apr 12, 2021, 3:00 PM IST

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లలో మాల్వేర్ లేదా వైరస్ ల గురించి తరచుగా నివేదికలు వస్తుంటాయి. కొన్ని రోజుల క్రితం గూగుల్ ప్లే స్టోర్ కూడా ఇలాంటి  మాల్వేర్ ఉన్న 150 ఆండ్రాయిడ్ యాప్ లని తీసివేసింది. ఈ యాప్స్ వినియోగదారులకు చాలా ప్రకటనలను చూపిసస్తుంటాయి. 

అయితే ఈ ప్రకటనల ద్వారా వారి ఫోన్లలో మాల్వేర్ యాప్స్ ఇన్‌స్టాల్ చేస్తుంటాయి. తాజాగా దీనికి సంబంధించి మరో 8 పాపులర్ ఆండ్రాయిడ్ యాప్స్ స్మార్ట్ ఫోన్‌లలో చాలా ప్రమాదకరమైనవిగా గుర్తించాయి, వీటిని ఇప్పుడు ప్లే స్టోర్ నుండి కూడా తొలగించారు. ఈ యాప్స్ మీ ఫోన్ ద్వారా మీ బ్యాంక్ ఖాతా సమాచారాన్ని కూడా హ్యాక్ చేస్తుండొచ్చు. అయితే ఇలాంటి యాప్స్ గురించి తెలుసుకుందాం ..
undefined
భద్రతా పరిశోధన సంస్థ చెక్ పాయింట్ కొత్త నివేదిక ప్రకారం, ఈ యాప్స్ మాల్వేర్ డ్రాప్పర్ విభాగంలో ఉంచారు. ఈ యాప్స్ అన్నిటిలో 'క్లాస్ట్ 82' అనే మాల్వేర్ డ్రాపర్ (మాల్వేర్ డెలివరీ) ఉంది. ఇక్కడ భయపడాల్సిన విషయం ఏమిటంటే ఈ మాల్వేర్ యాప్ ప్రత్యేకంగా గూగుల్ ప్లే ప్రొటెక్ట్‌ను కూడా ఓడించగల విధంగా ప్రత్యేకంగా రూపొందించారు.
undefined
ఉదాహరణకు, ఈ 8 యాప్స్ లోని ఏదైనా ఒక యాప్ మీ ఫోన్‌లో AlienBot బ్యాంకర్‌ను ఇన్‌స్టాల్ చేయవచ్చు, ఇది ఒక మాల్వేర్. ఈ మాల్వేర్ తో హ్యాకర్ మీ ఫోన్‌లోని బ్యాంకింగ్ యాప్స్ లో అనుమానాస్పద కోడ్‌ను చేర్చవచ్చు. అంతేకాకుండా మీ ఫోన్‌లో MRATను కూడా ఇన్‌స్టాల్ చేయవచ్చు, దీని ద్వారా మీ ఫోన్‌ను రిమోట్‌గా కంట్రోల్ చేయవచ్చు.
undefined
ఈ రెండిటి ప్రోగ్రామింగ్ ద్వారా మీ ఫోన్ లోని బ్యాంక్ యాప్ హ్యాక్ చేయవచ్చు అంతేకాదు మీ ఖాతా నుండి డబ్బును కూడా ఉపసంహరించుకోవచ్చు. ప్రత్యేక విషయం ఏమిటంటే, ఈ రెండు మాల్వేర్ల ద్వారా రెండు-కారకాల ప్రామాణీకరణను కూడా విచ్ఛిన్నం చేయవచ్చు. ఇప్పుడు ఈ 8 యాప్స్ గురించి తెలుసుకుందాం ...
undefined
ఫోన్‌లకు బ్యాంకింగ్ మాల్‌వేర్‌ను అందించే యాప్స్కేక్ VPN (com.lazycoder.cakevpns)పసిఫిక్ VPN (com.protectvpn.freeapp)eVPN (com.abcd.evpnfree)బీట్‌ప్లేయర్ (com.crrl.beatplayers)QR బార్‌కోడ్ స్కానర్ MAX (com.bezrukd.qrcodebarcode)మ్యూజిక్ ప్లేయర్ (com.revosleap.samplemusicplayers)టూల్టిప్నేటర్ లైబ్రరీ (com.mistergrizzlys.docscanpro)QRecorder (com.record.callvoicerecorder)
undefined
undefined
కాబట్టి ఈ యాప్స్ లో ఏదైనా మీ ఫోన్‌లో ఉంటే, దాన్ని వెంటనే తొలగించండి. అలాగే మీ మొబైల్ బ్యాంకింగ్ యాప్ పాస్‌వర్డ్‌ను కూడా మార్చండి.
undefined
click me!