ప్రపంచంలోనే మొట్టమొదటి 'డూ-ఇట్-ఆల్' స్క్రీన్‌తో శామ్‌సంగ్ స్మార్ట్ మానిటర్‌.. ఓ‌టి‌టి యాప్స్ కూడా సపోర్ట్..

First Published | Apr 10, 2021, 4:35 PM IST

ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ శామ్‌సంగ్  తాజాగా  కొత్త స్మార్ట్ మానిటర్‌ను విడుదల చేసింది, అయితే దీని ప్రత్యేకమైన ఫీచర్ ఏంటంటే వినూత్నమైన డూ-ఇట్-స్క్రీన్‌తో వస్తుంది. దీని ద్వారా వినియోగదారులు నెట్‌ఫ్లిక్స్, యూట్యూబ్, ఆపిల్ టివి ఇతర ఒటిటిల కంటెంట్ ని  ఆస్వాదించవచ్చు.  

అంతకాడు ఈ మానిటర్‌ను ఆఫీస్ పిసికి కూడా కనెక్ట్ చేయవచ్చు, అలాగే మైక్రోసాఫ్ట్ 365 ను ఉపయోగించి డాక్యుమెంట్స్ కూడా ఎడిట్ చేయవచ్చు.
ఈ ప్రీమియం లైఫ్ స్టైల్ స్మార్ట్ మానిటర్ మొబైల్, పిసి కనెక్టివిటీ, రిమోట్ హోమ్ ఆఫీస్, లెర్నింగ్ ఫీచర్లతో వస్తుంది. దీనితో పాటు స్మార్ట్ హబ్ కూడా అందించారు. ఇది శామ్సంగ్ స్మార్ట్ టీవీ ప్లాట్‌ఫామ్‌లో నిర్మించిన ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఓ‌టి‌టి కంటెంట్‌ను సులభంగా చూడటానికి ఉపయోగపడుతుంది. గెలాక్సీ ఫోన్‌ను శామ్‌సంగ్ డెక్స్ ద్వారా స్మార్ట్ మానిటర్‌కు కనెక్ట్ చేయడం ద్వారా పిసి లేకుండా డెస్క్‌టాప్ లాంటి అనుభవాన్ని పొందవచ్చు.

దీనికి 3-వైపుల బార్డర్ లెస్ డిస్ ప్లేతో వస్తుంది. ఒక మూలలో నుండి మరొక మూల వరకు ఫుల్ వ్యూ అందిస్తుంది ఇంకా చూడటానికి చాలా అందంగా కనిపిస్తుంది. శామ్సంగ్ అడ్వాన్స్డ్ ఐ కంఫర్ట్ టెక్నాలజీ కంటి పై ఒత్తిడిని తగ్గిస్తుంది. ఫ్లికర్ ఫ్రీ టెక్నాలజి కంటికి అలసట లేకుండా మానిటర్‌ను ఎక్కువసేపు చూడటానికి మీకు సహాయపడుతుంది. దీని ఐ సేవర్ మోడ్ స్క్రీన్ నుండి విడుదలయ్యే బ్లూ లైట్‌ను కూడా తగ్గిస్తుంది.
ధర, లభ్యతశామ్సంగ్ స్మార్ట్ మానిటర్ రెండు మోడళ్లలో లభిస్తుంది . 32 అంగుళాల స్క్రీన్ సైజ్ తో అల్ట్రా-హై డెఫినిషన్ (యుహెచ్‌డి) రిజల్యూషన్‌ను అందించే ఎం7. ఇంకా 32-అంగుళాలు, 27-అంగుళాల స్క్రీన్ సైజ్ తో ఎం5 పూర్తి హెచ్‌డి (ఎఫ్‌హెచ్‌డి ) రిజల్యూషన్‌కు సపోర్ట్ ఇస్తుంది.
శామ్సంగ్ స్మార్ట్ మానిటర్ సేల్స్ శామ్సంగ్ అధికారిక ఆన్‌లైన్ స్టోర్ శామ్‌సంగ్ షాప్, అమెజాన్ ఇతర అన్ని ప్రధాన రిటైల్ స్టోర్లలో రూ .28,000 ప్రారంభ ధరతో అందుబాటులోకి వచ్చింది. అయితే ప్రారంభ ఆఫర్ కింద స్మార్ట్ మానిటర్ ని రూ .21,999కె లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ ద్వారా లభిస్తుంది. లిమిటెడ్ ఆఫర్ లో స్మార్ట్ మానిటర్లను కొనుగోలు చేసే వినియోగదారుల కుకాంప్లిమెంటరీ వైర్‌లెస్ కీబోర్డ్ మరియు మౌస్ లభిస్తుంది.

Latest Videos

click me!