ఆపిల్ ఐఫోన్ 13 కొనేవారికి గుడ్ న్యూస్.. లాంచ్ కి ముందే భారీగా ధర తగ్గింపు..

First Published | Sep 13, 2021, 11:20 AM IST

న్యూఢిల్లీ: సెప్టెంబర్ 14న నిర్వహించనున్న ఆపిల్ వార్షిక ఈవెంట్‌లో  ఐఫోన్ 13 సిరీస్ లాంచ్ చేయనున్న సంగతి మీకు తెలిసిందే. అయితే డిస్కౌంట్ ధరలతో అందుబాటులో ఉన్న ప్రస్తుత జనరేషన్ ఐఫోన్‌లను కొనుగోలు చేసేందుకు ఇప్పుడు మంచి అవకాశం అందిస్తుంది.
 

కుపెర్టినో ఆధారిత ఐటి దిగ్గజం ఆపిల్ ఐఫోన్  13 సిరీస్‌ను అత్యంత శక్తివంతమైన ప్రాసెసర్, హార్డ్‌వేర్ అప్‌గ్రేడ్‌, ఇతర మార్పులతో విడుదల చేయనుంది. అయితే ఊహించినట్లుగానే   ఐఫోన్  13 సిరీస్‌ లాంచ్ ముందే ప్రస్తుత ఐఫోన్ 12 సిరీస్ ధరలను తగ్గించింది.
 

అతిపెద్ద ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో ఒకటైన ఫ్లిప్‌కార్ట్ ఆపిల్ ఐఫోన్ 12 సిరీస్‌లపై డిస్కౌంట్లను అందిస్తోంది.  ఆపిల్ ఐఫోన్ 12 మినీ 64జి‌బి వెర్షన్‌ ధర  రూ .59,999, 128జి‌బి వెర్షన్‌ ధర రూ.64,999 లకు అందుబాటులో ఉన్నాయి. ఈ రెండు వేరియంట్ల అసలు ధరలు 64జి‌బి  రూ .69,900 , 128జి‌బి  ధర రూ .74,900. 256జి‌బి వేరియంట్ రూ. 84,900 నుండి రూ.74,999 కి తగ్గింది. ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లో డిస్కౌంట్లు 22 శాతం వరకు ఉన్నాయి.


64జి‌బి స్టోరేజ్‌తో   ఆపిల్ ఐఫోన్ 12 కోసం ఇప్పుడు 79,900 బదులుగా రూ .66,999కే సొంతం చేసుకోవచ్చు, అయితే 128జి‌బి వేరియంట్ ని రూ. 84,900 కి బదులుగా రూ .71,999 వద్ద కొనుగోలు చేయవచ్చు. ఐఫోన్ 12 256జి‌బి వేరియంట్ అసలు ధర రూ. 94,900 దీనిని మీరు రూ. 81,999కే పొందవచ్చు.
 

మీరు 128జి‌బి స్టోరేజ్‌తో ఆపిల్ ఐఫోన్ 12ప్రొని కొనుగోలు చేయాలనుకుంటే ఫ్లిప్‌కార్ట్ లో Rs1,15,900 కి లభిస్తుంది, అయితే 256జి‌బి వేరియంట్ ధర రూ .1,25,900. 512జి‌బి వేరియంట్ ధర రూ .1,45,900. మీరు ఐఫోన్ 12ప్రొ మ్యాక్స్ ని మూడు వేరియంట్‌లలో కొనుగోలు చేయవచ్చు. వీటిలో  128జి‌బి స్టోరేజ్‌ ధర   Rs1,25,900, 256జి‌బి స్టోరేజ్‌ ధర రూ .1,35,900, 512జి‌బి  స్టోరేజ్‌ ధర రూ .1,55,900.

ఆపిల్ ఐఫోన్ 12 సిరీస్ నెక్స్ట్ జనరేషన్ న్యూరల్ ఇంజిన్‌తో పాటు ఏ14 బయోనిక్ చిప్‌తో నడుస్తుంది. ఐఫోన్ 12 మినీ, ఐఫోన్ 12 వెనుకవైపు రెండు కెమెరాల మాడ్యూల్‌ ఉంటాయి, వీటిలో 12ఎం‌పి అల్ట్రా వైడ్, వైడ్ కెమెరా లభిస్తాయి. అయితే ఐఫోన్ 12 ప్రో, ఐఫోన్ 12 ప్రో మాక్స్ లో మాత్రం అదనపు 12ఎం‌పి టెలిఫోటో కెమెరా ఉంటుంది.

పాత మోడళ్లతో పోలిస్తే ఐఫోన్ 12 తేలికైనది, హ్యాండిల్ చేయడం కూడా సులభంగా ఉంటుంది. ఐ‌ఓ‌ఎస్ 14 కొత్త కస్టమైజేషన్ ఆప్షన్స్, ప్రైవసీ ఫీచర్స్క్ష్ తో కూడా అందిస్తుంది. దీనికి రెండు బ్యాక్ కెమెరాలు ఉన్నాయి-ఒకటి వైడ్ యాంగిల్ మరొకటి అల్ట్రా-వైడ్ యాంగిల్. రెండూ కామెరాలకు  12 మెగాపిక్సెల్ సెన్సార్‌ ఉంటాయి. నైట్ మోడ్ ఇప్పుడు ఫ్రంట్ కెమెరాతో సహా అన్ని కెమెరాలలో పనిచేస్తుంది, ఇంకా స్టిల్ షాట్‌లు, అలాగే వీడియోలు డే టైం అలాగే రాత్రి వేళల్లో చాలా క్లియర్ అండ్ డీటైల్ గా ఉంటాయి. ఈ మొత్తం 4 డివైజెస్ ని 5జి కాపాబిలిటీస్ తో అందిస్తాయి.

Latest Videos

click me!