టెక్నో స్పార్క్ 7 ప్రో మే 25న భారతదేశంలో లాంచ్ కానుంది. దీనిని అమెజాన్ ఇండియా నుండి విక్రయించనున్నారు. అయితే లాంచ్ ముందు ఈ ఫోన్ కొన్ని ఫీచర్స్ బయటికి వచ్చాయి. టెక్నో స్పార్క్ 7 ప్రో 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేటుతో 6.6-అంగుళాల హెచ్‌డి ప్లస్ డిస్ ప్లేతో వస్తుంది. ఈ ఫోన్‌కు 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ సపోర్ట్‌తో మీడియాటెక్ హెలియో జీ 80 ప్రాసెసర్ అందించారు.
undefined
కెమెరా విషయానికొస్తే 48 మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను టెక్నో స్పార్క్ 7 ప్రోలో చూడవచ్చు. అంతే కాకుండా ఆండ్రాయిడ్ 11 ఆధారిత హయోస్ 7.5ను ఫోన్‌లో అందించారు. ఫోన్‌కి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇచ్చారు.
undefined
టెక్నో స్పార్క్ 7 ప్రోలో 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, ఏఐ సపోర్ట్ లభిస్తుంది. ఇవి కాకుండా డ్యూయల్ సిమ్ సపోర్ట్, 4జీ ఎల్‌టీఈ, డ్యూయల్ బ్యాండ్ వై-ఫై, బ్లూటూత్ 5.0, జీపీఎస్, 3.5 ఎంఎం ఆడియో జాక్‌ను అందించారు. ఈ ఫోన్‌కు 5000 ఎంఏహెచ్ బ్యాటరీ లభిస్తుంది, అలాగే 10W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.
undefined
దేశంలో పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా టెక్నో స్మార్ట్‌ఫోన్ వారంటీని రెండు నెలల పాటు పొడిగిస్తున్నట్లు ఇటీవల ప్రకటించింది. 150421 నుండి 150621 మధ్య గడువు ముగిసిన వినియోగదారుల వారంటీని వచ్చే రెండు నెలల వరకు పొడిగించినట్లు టెక్నో పేర్కొంది.
undefined
గూగుల్ ప్లే-స్టోర్ నుండి కార్ల్‌కేర్ యాప్ డౌన్‌లోడ్ చేయడం ద్వారా ఈ వారంటీని పొందవచ్చు. ఈ యాప్ లో మీరు మీ ఫోన్ ఐఎంఈఐ నంబర్‌ను రిజిస్టర్ చేయాలి. పొడిగించిన వారంటీని పొందడానికి మీరు 300621 ముందు యాప్ లో దరఖాస్తు చేసుకోవాలి.
undefined