తక్కువ ధరకే వన్‌ప్లస్ కొత్త ఆండ్రాయిడ్ స్మార్ట్ టి‌వి.. 40 అంగుళాల డిస్‌ప్లేతో లాంచ్..

First Published | May 22, 2021, 10:42 AM IST

చైనీస్ కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ వన్‌పల్స్  కొత్త టీవీ త్వరలో లాంచ్ కానుంది. వన్‌ప్లస్ టీవీ40వై1 పేరుతో వస్తున్న ఈ టీవిని 1 మే 24న భారతదేశంలో  అధికారికంగా విడుదల కానుంది. వన్‌ప్లస్ టీవీ 40వై1 స్క్రీన్ సైజ్ 40 అంగుళాలు ఉంటుంది. 

అంతకుముందు వన్‌ప్లస్ వన్‌ప్లస్ టీవీ 32వై1, వన్‌ప్లస్ టీవీ 43వై1 లను కూడా భారత్‌లో విడుదల చేసింది. రాబోయే టీవీ ఈ రెండు మోడళ్ల మధ్య ఉంటుంది. ప్రస్తుతం వన్‌ప్లస్ టీవీ 43 వై 1 ధర భారతదేశంలో రూ .26,999. అయితే కొత్త టీవీ ధర రూ .22,999గా ఉంటుందని భావిస్తున్నారు.
undefined
వన్‌ప్లస్ టీవీ 40వై1 స్పెసిఫికేషన్లుఈ టీవికి సంబంధించి వన్‌ప్లస్ ఒక టీజర్‌ను కూడా విడుదల చేసింది. దీని ప్రకారం వన్‌ప్లస్ టీవీ 40వై1లో 64 బిట్ ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 9 ఆధారిత ఆక్సిజన్ ప్లే ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది, అయితే కంపెనీ ప్రాసెసర్ మోడల్ గురించి ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. ఈ టీవీ 1920x1080 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో 40 అంగుళాల డిస్‌ప్లేతో వస్తుంది. గామా ఇంజిన్ పిక్చర్ ఇన్హేలర్ టీవీలో అందుబాటులో ఉంటుంది. దీనికి వన్‌ప్లస్ కనెక్ట్ వంటి ఫీచర్లు లభిస్తాయి.
undefined

Latest Videos


వన్‌ప్లస్ టీవీ 40వై1 ఇంటర్నల్ క్రోమ్‌కాస్ట్‌ పొందుతుంది. అంతేకాకుండా అమెజాన్ అలెక్సా, గూగుల్ అసిస్టెంట్‌లకు కూడా సపోర్ట్ చేస్తుంది. గూగుల్ ప్లే స్టోర్ టీవీలో ఇచ్చారు. అలాగే నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, యూట్యూబ్ వంటి యాప్స్ టీవీలో ముందే ప్రీ లోడ్ చేసి వస్తాయి. అంతేకాకుండా టీవీ కార్యక్రమాలు, సినిమాలకు కూడా ఆటోమేటిక్ రిమైండర్ అందుబాటులో ఉంటుంది.
undefined
కనెక్టివిటీ కోసం వన్‌ప్లస్ టీవీ 40వై1 టీవీలో వై-ఫై 802.11 బిగ్రాఎన్, బ్లూటూత్ వి5 ఇచ్చారు. ఈ టీవీకి డాల్బీ ఆడియో సపోర్ట్ తో రెండు 20 వాట్ల స్పీకర్లు ఉంటాయి. ఇవి కాకుండా, ఈథర్నెట్ పోర్ట్, ఆర్ఎఫ్ కనెక్షన్ ఇన్పుట్, రెండు హెచ్డిఎంఐ పోర్టులు, ఎవి ఇన్, డిజిటల్ అవుట్పుట్, రెండు యుఎస్‌బి పోర్టులు అందుబాటులో ఉంటాయి.
undefined
click me!