ట్విట్టర్ హ్యాండిల్ @realmeTechLife ద్వారా కొత్త బ్రాండ్‌ను లాంచ్ గురించి వెల్లడించింది. అయితే రియల్‌మీ కొత్త బ్రాండ్ ప్రొడక్ట్ గురించి వివరాలు వెల్లడించలేదు, కాని టీజర్ లో స్మార్ట్ ప్రొడక్ట్స్ డి బ్రాండ్ కింద లాంచ్ అవుతాయని భావిస్తున్నారు.
undefined
కొత్త బ్రాండ్ గురించి రియల్‌మీ ఇండియా, యూరప్ సిఇఒ మాధవ్ శేత్ మాట్లాడుతూ, 'డి' బ్రాండ్ మరి కొద్ది రోజుల్లో రాబోతున్నందుకు మేము చాలా సంతోషిస్తున్నాము. ఇది మా రియాలిటీ టెక్ లైఫ్ ఎకోసిస్టమ్‌లో మొదటి బ్రాండ్ అవుతుంది. భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా మాకు లభిస్తున్న ప్రతిస్పందనకు కృతజ్ఞతలు. రాబోయే బ్రాండ్ ప్రతి ఒక్కరి ప్రేమను పొందుతుందని, అలాగే ఈ బ్రాండ్ నుండి ఆకర్షణీయమైన టెక్ లైఫ్ ఉత్పత్తులతో విభిన్నమైన, కొత్త, ఉపయోగకరమైన అనుభవాన్ని పొందుతారని నమ్ముతున్నాము. ' అని అన్నారు.
undefined
ఇటీవల చిప్‌సెట్ తయారీ సంస్థ క్వాల్‌కామ్ కొత్త చిప్‌సెట్ స్నాప్‌డ్రాగన్ 778జి 5జిని ఇటీవల విడుదల చేసినట్లు తెలిపింది. ఈ కొత్త 5జి ప్రాసెసర్‌ను ప్రారంభించడంతో రియల్‌మీ ఈ ప్రాసెసర్‌తో వచ్చే ఫోన్‌ను కూడా ప్రకటించింది. 778జి 5జితో విడుదల చేసిన ప్రపంచంలోనే మొట్టమొదటి స్మార్ట్‌ఫోన్ రియల్‌మీ క్విక్‌సిల్వర్ అని సంస్థ తెలిపింది.
undefined
రియల్‌మీ క్విక్‌సిల్వర్ ఒక ప్రీమియం మిడ్‌రేంజ్ స్మార్ట్‌ఫోన్ ఇది షియోమి, మోటరోలా, ఒప్పో, వివో వంటి సంస్థలతో పోటీపడుతుంది. స్నాప్‌డ్రాగన్ 778జి 5జి అనేది 6 జిఎమ్ ప్రాసెస్‌పై నిర్మించిన 5జి ప్రాసెసర్. ఇందులో క్వాల్‌కామ్ క్రియో 670 సిపియు అందించారు, ఇది 40 శాతం మెరుగైన ప్రాసెసింగ్, 40 శాతం మెరుగైన జిపియు పనితీరును కనబరుస్తుందని పేర్కొంది.
undefined