జియో ఫోన్‌లో యూట్యూబ్, గూగుల్ వంటి యాప్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ జియో ఫోన్ KaiOSతో పనిచేస్తుంది. అలాగే సంస్థ ఎప్పటికప్పుడు జియో ఫోన్ కోసం అప్ డేట్ లను కూడా విడుదల చేస్తుంది.
ఇప్పుడు జియో ఫోన్ కస్టమర్లు వాట్సాప్ ద్వారా ఆన్ లిమిటెడ్ గా మాట్లాడవచ్చు. కైయోస్‌తో ఉన్న జియో ఫోన్, ఇతర ఫీచర్ ఫోన్ వినియోగదారులు ఈ అప్ డేట్ కోసం చాలా కాలంగా వేచి ఉన్నారు.తాజా అప్ డేట్ తో మీరు వాట్సాప్ ద్వారా వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. ఇంతకుముందు ఈ జియో ఫోన్ లో వాట్సాప్ చాట్ మాత్రమే ఉండేది. ఇప్పుడు చాట్ తో పాటు వాట్సాప్ కాల్స్ కూడా చేసుకోవచ్చు.
జియో ఫోన్‌లోని వాట్సాప్ వాయిస్ కాల్ వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ (VoIP) టెక్నాలజీతో పని చేస్తుంది. మీ ఫోన్‌లో మీకు ఇంటర్నెట్ ఉంటే, ఇప్పుడు మీరు వాట్సాప్ ద్వారా సులభంగా కాల్స్ చేయవచ్చు. జియో ఫోన్ కోసం వాట్సాప్ ఫీచర్ 2018లో ప్రారంభించింది.
మీకు జియో ఫోన్ ఉంటే మీరు వాట్సాప్ వెర్షన్ 2.2110.41 ను డౌన్‌లోడ్ చేసుకోవాలి లేదా మీరు మీ వాట్సాప్‌ను అప్‌డేట్ చేసుకోవచ్చు. దీని తరువాత వాట్సాప్ ఓపెన్ చేసే ఇప్పుడు మీరు వాయిస్ కాల్ ఎవరితో మాట్లాడాలనుకుంటున్నారో వారి చాట్‌ను సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత మీకు చాట్ లో కనిపించే వాయిస్ కాల్ పై క్లిక్ చేసి వాట్సాప్ కాల్ చేయవచ్చు.
అంతేకాకుండా మీకు వాట్సాప్ వాయిస్ కాల్ వస్తే, మీరు దానిని సాధారణ కాల్ లాగా స్వీకరించవచ్చు. జియో ఫోన్‌తో పాటు, నోకియా 8110 4జి వంటి ఫీచర్ ఫోన్‌లకు కూడా ఈ అప్‌డేట్ అందుబాటులో ఉంటుంది.