జస్ట్ రూ.1199కే స్మార్ట్ వాచ్! అస్సలు మిస్ అవ్వకండి.. కొద్దిరోజులే ఛాన్స్..

First Published | May 25, 2024, 10:53 AM IST

ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ బోట్ ఇండియాలో బోట్ వేవ్ సిగ్మా 3 అనే కొత్త బడ్జెట్ స్మార్ట్ వాచ్‌ను లాంచ్  చేసింది. ఈ స్టార్‌వాచ్ పెద్ద 2.01-అంగుళాల డిస్‌ప్లే, క్రెస్ట్ + OS ద్వారా పనిచేస్తుంది.
 

ఈ వాచ్ అల్యూమినియం అల్లాయ్ కేస్‌తో తయారు చేయబడింది. మెటల్, సాఫ్ట్ సిలికాన్ బెల్ట్స్ లభిస్తుంది. యాక్టివ్ బ్లాక్, మెటల్ బ్లాక్, మెటల్ గ్రే, కూల్ గ్రే, చెర్రీ బ్లోసమ్, రూస్టిక్ రోజ్, సఫైర్ బ్రీజ్ అనే ఏడు కలర్స్ లో అందుబాటులో ఉంది.

ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, మైంట్రా వంటి ఇ-కామర్స్ లో అండ్  సెలెక్ట్  చేసిన ఎలక్ట్రానిక్ స్టోర్‌లలో ఆఫ్‌లైన్‌ సేల్స్  ద్వారా అందుబాటులో ఉంది.

బోట్‌వేవ్ సిగ్మా స్మార్ట్‌వాచ్ 3 240 x 240 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 2.01-అంగుళాల స్క్వారీష్ డిస్‌ప్లే, కష్టమైజెడ్  DIY వాచ్ ఫేస్ స్టూడియోతో వస్తుంది.

క్రెస్ట్ యాప్ ద్వారా స్టోర్  చేసిన ముఖ్యమైన సమాచారాన్ని ఈజీగా యాక్సెస్ చేయడానికి QR ట్రే ఉంది. ఈ స్మార్ట్ వాచ్ 7 రోజుల వరకు బ్యాటరీ లైఫ్  ఇస్తుంది. బ్లూటూత్ కాలింగ్ ఉపయోగించినప్పటికీ బ్యాటరీని 2 రోజులు ఛార్జ్ చేయవలసిన అవసరం లేదు.
 


MapmyIndia ద్వారా టర్న్-బై-టర్న్ నావిగేషన్ కూడా ఉంది.  దుమ్ము, వాటర్  రిసిస్టెంట్ కోసం IP67 సర్టిఫికేట్ పొందింది. ఏ రకమైన వాతావరణంలోనైనా ఈ వాచ్ ఉపయోగించవచ్చు. హార్ట్ రేట్ మానిటరింగ్, SpO2 రీడింగ్ మొదలైన ఎన్నో ఫిట్‌నెస్ ఫీచర్లు కూడా ఉన్నాయి. మీరు క్రెస్ట్ యాప్ ద్వారా కూడా ఈ వివరాలను చూడవచ్చు. 

ఎమర్జెన్సీ SOS, కెమెరా కంట్రోల్, మ్యూజిక్  కంట్రోల్,   వాచ్ పోయిన లేదా మొబైల్ ఫైండర్ వంటి అనేక ఉపయోగకరమైన ఫీచర్‌లు కూడా ఉన్నాయి. ఈ అన్ని ఫీచర్లతో కూడిన బడ్జెట్ స్టార్ట్‌వాచ్ రూ.1,199 ప్రారంభ ధరతో లాంచ్ చేయబడింది. ఈ ఆఫర్ లిమిటెడ్  పిరియడ్ మాత్రమే. తరువాత దాని ధర రూ.1,500 వరకు పెరగవచ్చు.

Latest Videos

click me!