మార్కెట్లోకి కొత్త స్మార్ట్ టీవీ..150 లైవ్ ఛానల్స్..హోమ్ థియేటర్‌ సౌండ్ కూడా..

First Published | May 25, 2024, 12:12 AM IST

 Xiaomi  స్మార్ట్ TV A సిరీస్‌లో కొత్త ఎడిషన్‌ను తీసుకొస్తుంది. అయితే ఈ టివి గత సంవత్సరం స్మార్ట్ టీవీకి అప్ డేటెడ్  వెర్షన్ కావచ్చు.
 

Xiaomi   కొత్త స్మార్ట్ టీవీ 32-అంగుళాల, 40-అంగుళాలు, 43-అంగుళాల సైజ్ లో వస్తుంది. ఈ స్మార్ట్ టీవీ ప్రారంభ ధర రూ.12,999 మాత్రమే. మీరు ఈ Xiaomi స్మార్ట్ టీవీని Amazon ఇంకా  Xiaomi  అఫీషియల్ వెబ్‌సైట్‌ ద్వారా  కోనవచ్చు. 40 అంగుళాల మోడల్ ధర రూ.22,999 కాగా, 43 అంగుళాల మోడల్ ధర రూ.24,999.
 

గత సంవత్సరం వచ్చిన Xiaomi A సిరీస్ స్టార్ట్ టీవీకి కొత్త ఎడిషన్ కొన్ని మార్పులతో మాత్రమే వస్తుంది. 40-  43-అంగుళాల మోడల్‌లు క్వాడ్-కోర్ కార్టెక్స్ A55 ప్రాసెసర్‌తో ఉండగా, 32-అంగుళాల మోడల్‌లో కార్టెక్స్ A35 ఉంది.
 


మీరు ఈ Xiaomi స్మార్ట్ టీవీలో Xiaomi TV+ ఫీచర్‌ని ఉపయోగించి 150 కంటే ఎక్కువ లైవ్ ఛానెల్స్ చూడవచ్చు. 32-అంగుళాల మోడల్‌లో 1 GB RAM ఉంది. మిగతా రెండు మోడల్స్ 1.5 GB RAMతో ఉంటాయి. అన్ని మోడల్స్ 8 GB స్టోరేజ్ తో వస్తాయి.
 

ఈ Xiaomi TV 20W ఆడియో అవుట్‌పుట్‌తో ఉంటుంది. డాల్బీ ఆడియో ఇంకా  DTS:X ఫీచర్లు మెరుగైన ఆడియో అనుభవాన్ని అందిస్తాయి. బ్లూటూత్ 5.0, 2 HDMI పోర్ట్‌లు, WiFi, USB 2.0 అండ్  ఈథర్‌నెట్ పోర్ట్ కూడా ఉంది.
 

Latest Videos

click me!