Smart Plug: మారిన కాలంతో పాటు టెక్నాలజీ కూడా మారింది. మార్కెట్లోకి రకరకాల గ్యాడ్జెట్లు అందుబాటులోకి వస్తున్నాయి. ఇంట్లో ఉన్న సాధారణ ఎలక్ట్రానిక్ వస్తువులను స్మార్ట్ గ్యాడ్జెట్స్‌లాగా మార్చుకునే ఒక ప్రొడక్ట్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఇంట్లో ఉన్న టీవీ, హీటర్, ఎలక్ట్రిక్ కెట్టిల్ వంటి పరికరాలను స్మార్ట్‌గా మార్చుకోవాలనుకుంటే Lifelong 10A WiFi Smart Power Plug మంచి ఎంపికగా చెప్పవచ్చు. ఈ స్మార్ట్ ప్లగ్ సహాయంతో మొబైల్ యాప్ లేదా వాయిస్ కమాండ్స్ ద్వారా ఎలక్ట్రానిక్ పరికరాలను ఎక్కడి నుంచైనా నియంత్రించవచ్చు. స్మార్ట్ హోమ్ టెక్నాలజీకి ఇది సులభమైన అడుగు. ఈ స్మార్ట్ ప్లగ్ 10A పవర్ సామర్థ్యం కలిగి ఉంటుంది. అందువల్ల ఎక్కువ పవర్ అవసరమయ్యే పరికరాలను కూడా సురక్షితంగా ఉపయోగించవచ్చు. ఈ ప్లగ్ ద్వారా టీవీ, హీటర్, ఎలక్ట్రిక్ కెట్టిల్, ఫ్యాన్‌తో పాటు ఇతర వస్తువులను ఆపరేట్ చేసుకోవచ్చు. ఇది ఫైర్‌ప్రూఫ్ WPC సర్టిఫైడ్ మెటీరియల్తో తయారు చేసినందువల్ల సురక్షితంగా ఉంటుంది. అలాగే పాలీకార్బొనేట్ (PC) మెటీరియల్ వాడటం వల్ల దీర్ఘకాలం ఉపయోగించవచ్చు.
25
మొబైల్ యాప్, వాయిస్ కంట్రోల్ సౌకర్యం
ఈ స్మార్ట్ ప్లగ్ ప్రధాన ప్రత్యేకత యాప్, వాయిస్ కంట్రోల్. మీరు స్మార్ట్‌ఫోన్‌లో యాప్ ద్వారా పరికరాలను ఎక్కడి నుంచైనా ఆన్ లేదా ఆఫ్ చేయవచ్చు. అంతేకాదు, ఇది అమెజాన్ అలెక్సాతో పాటు గూగుల్ అసిస్టెంట్‌కు కూడా సపోర్ట్ చేస్తుంది. దీంతో వాయిస్ కమాండ్స్‌తో ఇంట్లోని ఎలక్ట్రానిక్ పరికరాలను ఆపరేట్ చేసుకోవచ్చు.
35
టైమర్, షెడ్యూల్ ఫీచర్‌తో ఆటోమేటిక్ కంట్రోల్
ఈ స్మార్ట్ ప్లగ్‌లో స్మార్ట్ షెడ్యూల్, టైమర్ ఫీచర్లు ఉన్నాయి. మీరు మీ రోజువారీ అవసరాలకు అనుగుణంగా పరికరాల పని సమయాన్ని సెట్ చేయవచ్చు. ఉదాహరణకు ఉదయం లేచే ముందు గీజర్ ఆన్ అవ్వడం. రాత్రి ఒక నిర్దిష్ట సమయానికి లైట్లు ఆఫ్ అవ్వడం. అవసరం లేకపోతే ఆటోమేటిక్‌గా పవర్ ఆఫ్ కావడం. ఇలా చేయడం వల్ల విద్యుత్ వృథా తగ్గుతుంది.
ఈ స్మార్ట్ ప్లగ్‌లో మల్టీ యూజర్‌తో పాటు గ్రూప్ కంట్రోల్ ఫీచర్ ఉంటుంది. మీరు ఈ ప్లగ్ యాక్సెస్‌ను కుటుంబ సభ్యులతో కూడా షేర్ చేయవచ్చు. దాంతో అందరూ తమ మొబైల్ ద్వారా పరికరాలను నియంత్రించగలరు. అలాగే ఒకేసారి అనేక పరికరాలను గ్రూప్‌గా నియంత్రించే అవకాశం కూడా ఉంటుంది. ఇది స్మార్ట్ హోమ్ మేనేజ్‌మెంట్‌ను మరింత సులభం చేస్తుంది.
55
సురక్షిత డిజైన్, సేఫ్టీ ఫీచర్లు
ఈ స్మార్ట్ ప్లగ్ కాంపాక్ట్, అట్రాక్టివ్ డిజైన్‌తో వస్తుంది. ఈ ప్లగ్ ఇంటి ఇంటీరియర్‌కు కూడా అందాన్నిస్తుంది. ఇందులో కొన్ని ముఖ్యమైన భద్రతా ఫీచర్లు కూడా ఉన్నాయి. ఆటోమేటిక్ టైమర్, ఓవర్‌లోడ్ ప్రొటెక్షన్, పవర్ సర్జ్ వచ్చినప్పుడు ఆటోమేటిక్ షట్‌డౌన్, ఫైర్ ప్రూఫ్ మెటీరియల్. ఇవి మీ ఇంటి పరికరాలను విద్యుత్ ప్రమాదాల నుంచి రక్షిస్తాయి.
మొత్తంగా, Lifelong 10A WiFi Smart Plug సహాయంతో ఇంట్లో ఉన్న సాధారణ ఎలక్ట్రానిక్ పరికరాలను స్మార్ట్ డివైస్‌లుగా మార్చుకోవచ్చు. మొబైల్ యాప్, వాయిస్ కంట్రోల్, టైమర్ వంటి సౌకర్యాల వల్ల ఇది ఆధునిక స్మార్ట్ హోమ్‌కు సరైన గాడ్జెట్‌గా చెప్పవచ్చు.