Sim Card Fact: మనం ప్రతిరోజూ మొబైల్ ఫోన్‌లో సిమ్ కార్డును వాడుతూనే ఉంటాం. కానీ దానిలోని ఒక మూల ఎప్పుడూ కత్తిరించినట్టుగా ఎందుకు ఉంటుందో చాలా మందికి తెలియదు. నిజానికి ఇది కేవలం డిజైన్ కాదు, దాని వెనుక ఒక స్పెషల్ కారణం ఉంది.
సిమ్ కార్డు ఎప్పుడూ ఒక మూల తెగిపోయినట్టుగా ఉంటుంది. ఇది యాదృచ్ఛికం కాదు. ఫోన్‌లో సిమ్‌ను సరిగ్గా పెట్టడానికి ప్రత్యేకంగా అలా రూపొందించారు. మూల కత్తిరించడం వల్ల యూజర్ సులభంగా ఏ వైపు పెట్టాలో గుర్తించగలడు. తప్పుగా ఇన్సర్ట్ చేస్తే మొబైల్ నెట్‌వర్క్ లభించదు. అలాగే సిమ్ కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది.
24
సిమ్ కార్డు పని విధానం
సిమ్ అంటే Subscriber Identity Module. ఇది మొబైల్‌ను సెల్యులార్ నెట్‌వర్క్‌కు కనెక్ట్ చేయడమే ప్రధాన పని. ఇందులో IMSI (International Mobile Subscriber Identity) నంబర్, సంబంధిత సెక్యూరిటీ కీలు స్టోర్ అయి ఉంటాయి. ఫోన్ ఆన్ చేసిన వెంటనే, సిమ్ డేటా నెట్‌వర్క్‌కు పంపిస్తారు. ఆ తర్వాత నెట్‌వర్క్ యూజర్‌ను ధృవీకరిస్తుంది.
34
నెట్‌వర్క్ యాక్సెస్ ఎలా లభిస్తుంది?
సిమ్ కార్డు సహాయంతో యూజర్ వివరాలు ధృవీకరించిన తర్వాతే నెట్‌వర్క్ యాక్సెస్ లభిస్తుంది. ఈ ప్రక్రియలో ఎవరైనా ఇతర కంపెనీ సిమ్‌తో వేరే నెట్‌వర్క్‌కు కనెక్ట్ కావడం సాధ్యం కాదు. అందుకే ఒక్కో కంపెనీ సిమ్ కేవలం తమ నెట్‌వర్క్‌కే పరిమితం అవుతుంది.
మనకు సాధారణంగా కనిపించే సిమ్ కార్డు డిజైన్ వెనుక ఇంత కీలకమైన టెక్నికల్ ఉద్దేశం ఉంది. ఒక మూల కత్తిరించడం వల్లే సిమ్‌ను సులభంగా, సేఫ్‌గా ఉపయోగించగలుగుతున్నాం. ఇది యూజర్లకు చిన్న విషయం అనిపించినా, మొబైల్ టెక్నాలజీలో చాలా ప్రాముఖ్యం కలిగిన అంశం.