సామ్‌సంగ్ గెలాక్సీ S24 అల్ట్రా 5G పై భారీ తగ్గింపు

Published : Aug 17, 2025, 05:56 PM IST

Samsung Galaxy S24 Ultra 5G price drops: సామ్‌సంగ్ గెలాక్సీ S24 అల్ట్రా 5G స్మార్ట్ ఫోన్ పై భారీ త‌గ్గింపు ఉంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఏకంగా రూ.39,000 తగ్గింపు, అదనంగా యాక్సిస్ బ్యాంక్ కార్డుపై రూ.4,000 తగ్గింపు ఆఫ‌ర్లు ఉన్నాయి. పూర్తి వివరాలు మీకోసం. 

PREV
15
సామ్‌సంగ్ గెలాక్సీ S24 అల్ట్రా 5G పై ఫ్లిప్‌కార్ట్‌లో ఇండిపెండెన్స్ డే సేల్‌లో భారీ ఆఫర్లు

ఫ్లిప్‌కార్ట్ ఇండిపెండెన్స్ డే సేల్ ( Independence Day ) చివరి రోజు సామ్‌సంగ్ గెలాక్సీ S24 అల్ట్రా 5Gపై ఇప్పటివరకు లేని తగ్గింపు లభించింది. రూ.39,000 తగ్గింపు తర్వాత ఈ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ ధర రూ.80,990కి పడిపోయింది. అదనంగా, ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ వాడితే మరో రూ.4,000 తగ్గింపు లభిస్తుంది. దీంతో ధర రూ.77,000 కంటే తక్కువ అవుతుంది.

DID YOU KNOW ?
సామ్‌సంగ్ మొబైల్ కంపెనీ
సామ్‌సంగ్ మొబైల్ కంపెనీని 1988లో స్థాపించారు. ఇది సియోల్, దక్షిణ కొరియాలో ప్రారంభమైంది. సామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్ విభాగం కింద నడుస్తూ, మొట్టమొదటి ఫోన్‌ను 1988లోనే విడుదల చేసింది.
25
Samsung Galaxy S24 Ultra ధర, EMI ఆప్షన్లు

ఫ్లిప్‌కార్ట్‌లో గెలాక్సీ S24 అల్ట్రా 12GB + 256GB వెర్షన్ రూ.81,985కి లిస్ట్ అయింది. మొదట ఈ మోడల్ లాంచ్ ధర రూ.1,29,999. ప్ర‌స్తుత ధ‌ర‌తో పోలిస్తే వినియోగదారులు మొత్తం రూ.48,000కుపైగా తగ్గింపును పొందుతున్నారు. EMI ఆప్షన్‌లో నెలకు రూ.4,005 నుంచి చెల్లింపు అవకాశం ఉంది. పాత మొబైల్ ఫోన్ ఇచ్చి ఎక్స్చేంజ్‌లో రూ.66,100 వరకు తగ్గింపు పొందే అవకాశం కూడా ఉంది.

35
సామ్‌సంగ్ గెలాక్సీ S24 అల్ట్రా లో అద్భుత‌మైన కెమెరా ఫీచర్లు

సామ్‌సంగ్ గెలాక్సీ S24 అల్ట్రా 200MP ప్రైమరీ కెమెరాతో వస్తోంది. దీంతో ఆప‌టు 50MP పెరిస్కోప్ లెన్స్, 10MP టెలిఫోటో, 12MP అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. ముందుభాగంలో 12MP సెల్ఫీ కెమెరా ఉంది. దీంతో వినియోగదారులు అధిక క్వాలిటీ ఫొటోలు, వీడియోలు తీయవచ్చు. 24fps, 30fps, 60fps, 120fps ప్రేమ్ రేట్ లో 8K, 4K, 1080p, 720p రిజల్యూషన్ లో వీడియోలు రికార్డు చేయవచ్చు.

45
సామ్‌సంగ్ గెలాక్సీ S24 అల్ట్రా డిస్‌ప్లే, డిజైన్ ప్రత్యేకతలు

సామ్‌సంగ్ గెలాక్సీ S24 అల్ట్రా స్మార్ట్‌ఫోన్ 6.8 ఇంచుల QHD+ AMOLED డిస్‌ప్లేతో వస్తుంది. 120Hz రిఫ్రెష్‌రేట్, 2,600 నిట్స్ బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది. దీంతో ఎండలో కూడా స్పష్టంగా కనిపిస్తుంది. సినిమాలు, వెబ్‌సిరీస్‌లను బింజ్-వాచ్ చేయడానికి ఇది అనుకూలంగా ఉంటుంది.

గేమింగ్ కోసం కూడా ఈ ఫోన్ అనుకూలంగా ఉంటుంది. ప్రీమియం గ్లాస్ బాడీ, అల్యూమినియం ఫ్రేమ్‌తో ఈ ఫోన్ డిజైన్ కూడా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇందులో S Pen సపోర్ట్ కూడా అందుబాటులో ఉంది.

55
సామ్‌సంగ్ గెలాక్సీ S24 అల్ట్రా బ్యాటరీ, ప్రాసెసర్

సామ్ సంగ్ గెలాక్సీ S24 అల్ట్రా శక్తివంతమైన Snapdragon 8 Gen 3 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. 12GB RAM సపోర్ట్ ఉండటంతో గేమింగ్, మల్టీటాస్కింగ్‌లో అద్భుతమైన పనితీరును చూపిస్తుంది.

బ్యాటరీ సామర్థ్యం 5,000mAh. 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. అయితే, ఈ ప్యాకేజీలో ఛార్జర్ ఇవ్వడం లేదు. యూజర్లు ఏ ఆండ్రాయిడ్ ఫోన్ ఛార్జర్‌తోనైనా ఈ ఫోన్‌ను ఛార్జ్ చేసుకోవచ్చు.

భారీ డిస్కౌంట్, సూపర్ పవర్ కెమెరా, ప్రీమియం డిస్‌ప్లే, Snapdragon 8 Gen 3 ప్రాసెసర్‌తో గెలాక్సీ S24 అల్ట్రా ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో బెస్ట్ డీల్ గా ఉంది. ఈ ధరలో కొత్త స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలని భావిస్తున్నవారికి ఇది మంచి డీల్ అని టెక్ నిపుణులు పేర్కొంటున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories