రెడ్‌మి, రియల్‌మీకి పోటీగా శామ్‌సంగ్ కొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్.. ధర, ఫీచర్స్ వివరాలు మీకోసం..

First Published | Feb 2, 2021, 4:43 PM IST

ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ శామ్‌సంగ్  కొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ శామ్‌సంగ్ గెలాక్సీ ఎం02ను భారత్‌లో విడుదల చేసింది.  గెలాక్సీ ఎం సిరీస్  నుండి ఇది కొత్త  బడ్జెట్ స్మార్ట్‌ఫోన్, ఇది గత సంవత్సరం ప్రారంభించిన శామ్‌సంగ్ గెలాక్సీ ఎం 01  అప్‌గ్రేడ్ వెర్షన్. గెలాక్సీ ఎం 02 డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌తో 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. శామ్‌సంగ్  గెలాక్సీ ఎం02   పోకో సి3, రెడ్‌మి 9, రియల్‌మీ సి 15, మైక్రోమాక్స్ ఇన్ 1బితో పోటీ పడుతోంది.
 

భారతదేశంలో శామ్‌సంగ్ గెలాక్సీ ఎం02 ధరశామ్‌సంగ్ గెలాక్సీ ఎం02 ధర భారతదేశంలో 6,999 రూపాయలు, ఈ ఫోన్ కేవలం ఒక వేరియంట్ 2 జిబి ర్యామ్, 32 జిబి స్టోరేజీలో మాత్రమే లభిస్తుంది. ఈ ఫోన్ ను అమెజాన్ నుండి కొనుగోలు చేయవచ్చు. అయితే లాంచింగ్ ఆఫర్ కింద ప్రస్తుతం ఈ ఫోన్‌ను 6,799 రూపాయలకు కొనుగోలు చేయవచ్చు. శామ్సంగ్ గెలాక్సీ ఎం02ని 3 జిబి ర్యామ్, 32 జిబి స్టోరేజ్ వేరియంట్‌ను విడుదల చేసింది, దీని ధర పై ప్రస్తుతం సమాచారం. గెలాక్సీ ఎం02 ను బ్లాక్, బ్లూ, గ్రే, రెడ్ కలర్ వేరియంట్లలో ఫిబ్రవరి 9 నుండి అమెజాన్, శామ్‌సంగ్ ఆన్‌లైన్ స్టోర్, అన్ని రిటైల్ స్టోర్స్ నుండి కొనుగోలు చేయవచ్చు.
undefined
శామ్‌సంగ్ గెలాక్సీ ఎం02 స్పెసిఫికేషన్లుఫోన్ డ్యూయల్ సిమ్ సపోర్ట్‌తో ఆండ్రాయిడ్ 10 బేస్డ్ వన్ యుఐతో వస్తుంది. 6.5-అంగుళాల హెచ్‌డి+ ఇన్ఫినిటీ వి డిస్ ప్లే కలిగి ఉంది. ఫోన్‌లో మీడియాటెక్ ప్రాసెసర్ అందించారు, 3 జీబీ వరకు ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ వరకు ఉంది, వీటిని మెమరీ కార్డ్ సహాయంతో 1 టిబికి పెంచవచ్చు.
undefined

Latest Videos


శామ్‌సంగ్ గెలాక్సీ ఎం02 కెమెరాకెమెరా గురించి మాట్లాడుతూ ఫోన్‌లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది, దీనిలో ప్రధాన లెన్స్ 13 మెగాపిక్సెల్స్ కెమెరా, మరొకటి 2 మెగాపిక్సెల్స్ కెమెరా. సెల్ఫీ కోసం, 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. బ్యూటీ, పోర్ట్రెయిట్‌తో సహా చాలా మోడ్‌లు కెమెరాతో లభిస్తాయి.
undefined
శామ్సంగ్ గెలాక్సీ ఎం02 బ్యాటరీఈ ఫోన్‌లో కనెక్టివిటీ కోసం 4 జి ఎల్‌టిఇ, వై-ఫై, బ్లూటూత్, జిపిఎస్ ఎ-జిపిఎస్, యుఎస్‌బి టైప్-సి పోర్ట్ అందించారు. దీనిలో 5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీని ఉంది, ఇది 10W ఫాస్ట్ ఛార్జింగ్ కు సపోర్ట్ చేస్తుంది. ఫోన్ బరువు 206 గ్రాములు.
undefined
click me!