ఫ్లిప్‌కార్ట్‌లో జపాన్‌ బ్యాంకు భారీ పెట్టుబడులు.. దీంతో 30 బిలియన్ డాలర్లకు చేరానున్న కంపెనీ విలువ..

First Published Jun 4, 2021, 2:58 PM IST

 ముంబయి: జపాన్‌ దిగ్గజ బ్యాంకు సాఫ్ట్‌బ్యాంక్ గ్రూప్ కార్పొరేషన్  ఈ-కామర్స్  దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో 700 మిలియన్ డాలర్లను  పెట్టుబడులు పెట్టేందుకు చర్చలు జరుపుతోంది. ఫ్లిప్‌కార్ట్‌ సంస్థలో తన మొత్తం వాటాను వాల్‌మార్ట్ ఇంక్‌కు విక్రయించిన మూడు సంవత్సరాల తరువాత ఈ పెట్టుబడి జరగనుంది.
 

ప్రతిపాదిత ఈ పెట్టుబడి సాఫ్ట్‌బ్యాంక్ విజన్ ఫండ్ 2 కు సంబంధించి 1.2-1.5 బిలియన్ల డాలర్ల నిధుల్లో భాగం. ఈ లావాదేవీతో ఫ్లిప్‌కార్ట్ విలువ 28 బిలియన్ డాలర్లుగా ఉంటుందని, ఈ ఒప్పందం 3-4 నెలల్లో ముగుస్తుందని భావిస్తున్నారు.
undefined
దక్షిణాఫ్రికా సంస్థ నాస్పర్స్ పెట్టుబడి విభాగమైన ప్రోసస్ వెంచర్స్ అలాగే ఇప్పటికే ఉన్న ఇతర పెట్టుబడిదారులు ఫ్లిప్‌కార్ట్‌లో తమ వాటాను పెంచుకోనున్నాయి. ఫలితంగా మొత్తం ఫ్లిప్‌కార్ట్ విలువ 30 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా.
undefined
ఈ లావాదేవీ భారత ఇ-కామర్స్ దిగ్గజం ప్రతిపాదిత జాబితాకు ముందే ఉంటుంది, రాబోయే 12-18 నెలల్లో జరగనుంది. కరోనా మహమ్మారి లాక్ డౌన్ కారణంగా ఆన్‌లైన్ అమ్మకాలు పెరిగాయని ఒక వ్యక్తి చెప్పారు. రానున్న12-18 నెలల్లో లిస్టింగ్‌కు రనున్న తరుణంలో అంతకుముందే ఈ లావాదేవీలు పూర్తికానున్నాయని భావిస్తున్నారు. అలాగే ఐపీఓకు ముందు మరోసారి నిధులు సమీకరణకు వెళ్లే అవకాశం ఉంది.
undefined
సింగపూర్ సావరిన్ వెల్త్ ఫండ్ జిఐసి, కెనడియన్ పెన్షన్ ఫండ్ సిపిపిఐబి కూడా ఫ్లిప్‌కార్ట్‌లో పెట్టుబడులు పెట్టడానికి చర్చలు జరుపుతున్నాయని మరో వ్యక్తి చెప్పారు. దీనికి సంబంధించి మే 11న ది ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. అయితే దీనిపై ఆయా సంస్థలు అధకారికంగా స్పందించాల్సి ఉంది. ఫ్లిప్‌కార్ట్, దాని డిజిటల్ చెల్లింపుల విభాగం ఫోన్‌పే 2022 నాటికి యుఎస్‌లో ఐపీవోకి వెళ్లాలని భావిస్తోంది.
undefined
ఫ్లిప్‌కార్ట్ లో పెట్టుబడుల లావాదేవీలను ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకులు జెపి మోర్గాన్, గోల్డ్‌మన్ సాచ్స్ నిర్వహిస్తున్నాయి. అయితే ఫ్లిప్‌కార్ట్‌కు సాఫ్ట్‌బ్యాంక్ పెట్టుబడులు కొత్తేమీ కాదు. కానీ మే 2018లో తన పెట్టుబడులను సాఫ్ట్‌ బ్యాంకు ఉపసంహరించుకుంది. వాల్‌మార్ట్ ఆధీనంలోకి ఒక సంవత్సరంలోనే సుమారు 20 శాతం వాటాను విక్రయించింది. ఇప్పుడు, సాఫ్ట్‌బ్యాంక్ విజన్ ఫండ్-2లో భారతదేశంలో దూకుడుగా పెట్టుబడులు పెట్టాలని యోచిస్తోంది.
undefined
click me!