రిలయన్స్ చౌకైనా 4జి ఫ్జోన్ : లాంచ్ ముందే ఫీచర్‌లు లీక్.. 13ఎం‌పి కెమెరాతో అందుబాటులోకి..

First Published Aug 14, 2021, 4:06 PM IST

దేశీయ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో మొట్టమొదటి, ప్రపంచంలోనే చౌకైన 4జి స్మార్ట్‌ఫోన్ జియో ఫోన్  నెక్స్ట్ లాంచ్ వచ్చే నెలలో కానుంది. అయితే లాంచ్ కి ముందే జియోఫోన్ నెక్స్ట్ గురించి లీకైన నివేదికలు తెరపైకి వచ్చాయి. జియోఫోన్ నెక్స్ట్ గూగుల్, జియో భాగస్వామ్యంతో అభివృద్ధి చేసారు. 

జియోఫోన్ నెక్స్ట్ సెల్ సెప్టెంబర్ 10 నుండి భారతదేశంలో ప్రారంభం కానుంది. లీకైన నివేదికలో జియోఫోన్ నెక్స్ట్ 13 మెగాపిక్సెల్ సింగిల్ రియర్ కెమెరాతో రాబోతున్నట్లు సూచించింది. అంతేకాకుండా ఈ ఫోన్ క్వాల్‌కామ్ ప్రాసెసర్‌తో అందించనున్నారు. జియోఫోన్ నెక్స్ట్  ఆండ్రాయిడ్ 11గో ఎడిషన్, హెచ్‌డి ప్లస్ డిస్‌ప్లే ఫోన్‌లో అందుబాటులో ఉంటుంది. ఇటీవల జరిగిన వార్షిక సమావేశంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ ఈ ఫోన్‌ను ప్రకటించారు.
 

ఎక్స్‌డి‌ఏ డెవలపర్లు జియోఫోన్ నెక్స్ట్ ఫీచర్ల గురించి కొంత సమాచారం ఇచ్చారు, దీని ప్రకారం ఫోన్  మోడల్ నంబర్ LS-5701-J. 720x1440 పిక్సెల్ రిజల్యూషన్‌తో డిస్‌ప్లే, క్వాల్‌కామ్ QM215 ప్రాసెసర్‌, గ్రాఫిక్స్ కోసం అడ్రినో 308 GPU అందుబాటులో ఉంటుంది.
 

ఈ ఫోన్ ఎక్స్5 ఎల్‌టి‌ఈ మోడెమ్‌కు సపోర్ట్ చేస్తుంది. కనెక్టివిటీ కోసం బ్లూటూత్ వి4.2, జి‌పి‌ఎస్ పొందుతుంది. ఫోన్ కెమెరా 1080 పిక్సెల్స్ అంటే ఫుల్ హెచ్‌డిలో రికార్డ్ చేయగలదు, LPDDR3 ర్యామ్ తో eMMC 4.5 స్టోరేజ్ లభిస్తుంది. 
 

13 మెగాపిక్సెల్ బ్యాక్, 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా లభిస్తుంది. గూగుల్ కెమెరా లెన్స్‌తో సహా చాలా రకాల యాప్‌లు ఫోన్‌తో ముందే ఇన్‌స్టాల్ చేయబడతాయి. భారతదేశంలో జియోఫోన్ నెక్స్ట్ ధర రూ .4,000 కంటే తక్కువగా ఉండవచ్చు.

click me!