8 ఛానెల్ ఫోటోప్లెథైస్మోగ్రఫీ సెన్సార్‌తో హానర్ సరికొత్త స్మార్ట్ వాచ్.. వారి కోసం ప్రత్యేకంగా లాంచ్..

First Published Aug 14, 2021, 11:22 AM IST

చైనా స్మార్ట్ ఫోన్ బ్రాండ్ హానర్ తాజాగా ఒక కొత్త స్మార్ట్ వాచ్ హానర్ వాచ్ జి‌ఎస్ 3ని దేశీయ మార్కెట్లో విడుదల చేసింది. ఎనిమిది ఛానెల్ ఫోటోప్లెథైస్మోగ్రఫీ (పి‌పి‌జి) సెన్సార్‌తో కంపెనీ నుండి వస్తున్న మొదటి స్మార్ట్ వాచ్. ఈ పి‌పి‌జి సెన్సార్ ద్వారా ఖచ్చితమైన హార్ట్ రేట్  మానిటరింగ్ క్లెయిమ్ చేయబడింది. 

ఈ స్మార్ట్ వాచ్ తో పాటు కంపెనీ హానర్ వి7 ప్రో ట్యాబ్‌ని కూడా ప్రవేశపెట్టింది, ఇందులో 120Hz రిఫ్రెష్ రేట్‌తో డిస్‌ప్లే, 256జి‌బి ఇంటర్నల్  స్టోరేజ్ ఇచ్చారు.

హానర్ వాచ్ జి‌ఎస్ 3 ధర గురించి  ప్రస్తుతం  అధికారిక సమాచారం లేదు. ఈ స్మార్ట్ వాచ్ సిల్వర్, బ్లూ వాయేజర్ కలర్‌లో లాడర్ స్ట్రాప్ అండ్ స్ట్రిమ్మర్ క్లాసిక్ గోల్డెన్ కేస్‌తో కొనుగోలు చేయవచ్చు. గ్లోబల్ మార్కెట్లో దీని లభ్యత గురించి ఎలాంటి వెల్లడించలేదు.

హానర్ వాచ్ జి‌ఎస్ 3 ఫీచర్లు

హానర్ వాచ్ జి‌ఎస్ 3 స్మార్ట్ వాచ్ అనేది గత సంవత్సరం లాంచ్ చేసిన హానర్ వాచ్ జి‌ఎస్ ప్రోకి  అప్‌గ్రేడ్ వెర్షన్.  ఈ వాచ్ గుండ్రటి డయల్ డిజైన్ తో  వస్తుంది. అంతేకాకుండా ఎనిమిది-ఛానల్ పి‌పి‌జి సెన్సార్ ఇందులో ఉపయోగించారు, దీనికి కృత్రిమ మేధస్సు సపోర్ట్ కూడా ఉంది. బెస్ట్ డిజైన్, అక్యురేట్ హెల్త్ మానిటర్ రిపోర్ట్  ఇష్టపడే వారి కోసం ఈ వాచ్ ప్రత్యేకంగా ప్రవేశపెట్టబడినట్లు కంపెనీ పేర్కొంది. దీనికి రెండు ఫిజికల్ బటన్లు లభిస్తాయి.

click me!