Jio : 1600 శాటిలైట్లను రంగంలోకి దింపుతున్న జియో.. అంబానీ మామ గట్టిగానే ప్లాన్ చేశాడుగా..!

Published : Nov 20, 2026, 08:23 PM IST

ఎలన్ మస్క్ స్టార్‌లింక్‌కు పోటీగా రిలయన్స్ జియో సొంత శాటిలైట్ ఇంటర్నెట్ నెట్‌వర్క్‌ను సిద్ధం చేస్తోంది. ఏకంగా 1600 ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.

PREV
14
జియో ప్లాన్ అదిరిందిగా...

ఎలన్ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్‌కు ముకేశ్ అంబానీ రిలయన్స్ జియో గట్టి పోటీ ఇవ్వనుంది. భారతదేశంలో సొంత శాటిలైట్ ఇంటర్నెట్ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయడంలో భాగంగా 1600 ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపాలని రిలయన్స్ ప్లాన్ చేస్తోంది. దేశంలో ఇంటర్నెట్ కనెక్టివిటీని బలోపేతం చేయడంతో పాటు విదేశీ శాటిలైట్ సేవలపై ఆధారపడటాన్ని తగ్గించడం ఈ ప్రాజెక్ట్ ముఖ్య ఉద్దేశం.

2035 నాటికి ప్రాజెక్ట్ పూర్తి

2035 నాటికి శాటిలైట్ నెట్‌వర్క్‌ను పూర్తిగా అందుబాటులోకి తీసుకురావాలని రిలయన్స్ లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఇంత భారీ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసే సామర్థ్యం ప్రస్తుతం భారత అంతరిక్ష రంగానికి తక్కువే. కాబట్టి దేశీయ శాటిలైట్ తయారీదారులు, టెక్ స్టార్టప్‌లు, బడా పారిశ్రామిక సంస్థలతో కలిసి పనిచేయాలని కంపెనీ భావిస్తోంది. బ్లూమ్‌బెర్గ్ రిపోర్ట్ ప్రకారం.. శాటిలైట్ల తయారీకి అవసరమైన మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడంపై రిలయన్స్ ప్రధానంగా దృష్టి పెట్టింది. దీనితో పాటు విదేశీ కంపెనీల నుంచి కూడా ఉపగ్రహాలను కొనుగోలు చేసే యోచనలో ఉంది.

24
అమెరికా నుంచి 400 ఉపగ్రహాల కొనుగోలు?

ఈ ప్రాజెక్టులో భాగంగా అమెరికా నుంచి కనీసం 400 ఉపగ్రహాలను దిగుమతి చేసుకోవాలని రిలయన్స్ యోచిస్తోంది. దీని కోసం రెండు అమెరికన్ కంపెనీలతో చర్చలు జరుపుతోంది. యూరోపియన్ శాటిలైట్ తయారీదారులను కూడా పరిశీలిస్తోంది. అయితే చైనా కంపెనీలను ఈ ప్రాజెక్టులో భాగస్వాములను చేసే ఆలోచన ప్రస్తుతానికి లేదని రిపోర్ట్స్ చెబుతున్నాయి.

2027 సెప్టెంబర్‌లో టెస్ట్ లాంచ్ నిర్వహించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఆ తర్వాత 2028 ప్రారంభం నుంచి దశలవారీగా ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెడతారు. వాస్తవానికి 2030 నాటికి ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని గతంలో లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ శాటిలైట్ల తయారీ, ప్రయోగాల్లో ఉన్న పరిమితుల కారణంగా ఆ గడువును 2035కి పొడిగించారు.

34
జియోకు సొంత శాటిలైట్ నెట్‌వర్క్ ఎందుకు?

కేవలం శాటిలైట్ ఇంటర్నెట్ రంగంలోకి అడుగుపెట్టడమే కాకుండా, ఈ ప్రాజెక్ట్ వెనుక పెద్ద లక్ష్యాలే ఉన్నాయని సమాచారం. రిలయన్స్ అనుబంధ సంస్థ జియో ప్లాట్‌ఫామ్స్ సేవలను మరింత విస్తృతం చేయడానికి ఈ నెట్‌వర్క్ సహాయపడుతుంది. సాధారణ ఇంటర్నెట్ సదుపాయాలు చేరుకోలేని గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లో కూడా హై-స్పీడ్ కనెక్టివిటీని అందించడమే ప్రధాన లక్ష్యం.

జాతీయ భద్రత పరంగా కూడా ఈ శాటిలైట్ నెట్‌వర్క్ కీలక పాత్ర పోషిస్తుంది. సైనిక ఘర్షణలు లేదా భౌగోళిక రాజకీయ సంక్షోభాలు తలెత్తినప్పుడు.. విదేశీ నియంత్రణలో లేని సొంత కమ్యూనికేషన్ వ్యవస్థలు దేశాలకు చాలా అవసరం. ఇలాంటి పరిస్థితుల్లో ఇండియా తనకంటూ సొంతంగా నియంత్రించగల శాటిలైట్ నెట్‌వర్క్‌ను కలిగి ఉండటం వ్యూహాత్మకంగా లాభిస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

భారత్ ముందు భారీ తయారీ సవాలు

బ్లూమ్‌బెర్గ్ రిపోర్ట్స్ ప్రకారం.. ప్రస్తుతం భారతదేశంలో ఏడాదికి 15 కంటే తక్కువ ఉపగ్రహాలు మాత్రమే తయారవుతున్నాయి. కానీ రిలయన్స్ ప్రాజెక్టుకు అవసరమైన శాటిలైట్లను అందించాలంటే, ఈ ఉత్పత్తిని ఏడాదికి సుమారు 200కి పెంచాల్సి ఉంటుంది. దీనికి అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించేందుకు పెట్టుబడులు పెట్టాలని రిలయన్స్ ప్లాన్ చేస్తోంది. అయితే ఉపగ్రహాలను తయారు చేస్తే సరిపోదు. 1,600 ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపడానికి మరిన్ని రాకెట్ ప్రయోగాలు, తగిన సౌకర్యాలు కూడా అవసరం.

44
స్టార్‌లింక్‌తో నేరుగా పోటీ

ప్రస్తుతం ఎలన్ మస్క్ స్టార్‌లింక్ ప్రపంచవ్యాప్తంగా 10,000 కంటే ఎక్కువ ఉపగ్రహాల నెట్‌వర్క్‌ను కలిగి ఉంది. అయితే ఈ రెండు కంపెనీల లక్ష్యాలు వేర్వేరు. స్టార్‌లింక్ గ్లోబల్ స్థాయిలో శాటిలైట్ ఇంటర్నెట్ సేవలను అందిస్తుండగా.. రిలయన్స్ ప్రాజెక్ట్ ప్రధానంగా భారతదేశ కనెక్టివిటీ అవసరాలు, జాతీయ ప్రయోజనాలపై దృష్టి పెట్టింది.

భారత్‌లో కార్యకలాపాలు ప్రారంభించాలన్న స్టార్‌లింక్ ప్రయత్నాలకు కూడా రెగ్యులేటరీ, భద్రతాపరమైన అడ్డంకులు ఎదురయ్యాయి. విదేశీ శాటిలైట్ నెట్‌వర్క్‌ల నియంత్రణపై ఉన్న ఆందోళనలు, దేశీయ కమ్యూనికేషన్ వ్యవస్థలపై సొంత నియంత్రణను నిర్ధారించుకోవాల్సిన అవసరం.. జియో కొత్త ప్రాజెక్టుకు మరింత ప్రాధాన్యం ఇస్తున్నాయి.

Read more Photos on
click me!

Recommended Stories