లాంచ్ కి ముందే రిలయన్స్ జియో మొట్టమొదటి ల్యాప్‌టాప్ ఫీచర్స్ లీక్.. ఇంటర్నెట్ లో ఫోటోస్ వైరల్..

First Published | Mar 8, 2021, 1:16 PM IST

రిలయన్స్ జియో  మొదటి ల్యాప్‌టాప్ గురించి చర్చలు జోరందుకున్నాయి. గత వారం జియో మొదటి ల్యాప్‌టాప్‌ను జియోబుక్ పేరుతో లాంచ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. 

ఆ వార్తల్లో జియో మొదటి ల్యాప్‌టాప్‌ ధర గురించి ఎటువంటి సమాచారం ఇవ్వనప్పటికీ బడ్జెట్ ధరకె అందుబాటులో ఉంటుందని నివేదికలో పేర్కొన్నారు. తాజా ఒక కొత్త నివేదికలో జియోబుక్ ల్యాప్‌టాప్ ధర గురించి సమాచారం ఇచ్చింది. జియోబుక్ ధర, లక్షణాల గురించి తెలుసుకుందాం ...
కొత్త నివేదిక ప్రకారం రిలయన్స్ జియో ల్యాప్‌టాప్ జియోబుక్ ధర రూ .9,999 గా ఉంటుంది,అయితే ఇది ప్రారంభ ధర మాత్రమే. జియోబుక్ ఇతర వేరియంట్లలో కూడా లాంచ్ కానుంది. అంతే కాకుండా జియోబుక్‌లో కూడా 4 జి కనెక్టివిటీ లభిస్తుంది. జియో ల్యాప్‌టాప్ జియోబుక్ లో ఫోర్క్డ్ ఆండ్రాయిడ్ ఉంటుంది, దీనిని జియోఓఎస్ అని పిలుస్తారు. ల్యాప్‌టాప్‌లో అన్ని జియో యాప్‌లకు అక్సెస్ ఉంటుంది.

జియోబుక్ కోసం చైనా కంపెనీ బ్లూబ్యాంక్ కమ్యూనికేషన్ టెక్నాలజీతో రిలయన్స్ భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు చెబుతున్నారు. అదే సంస్థ జియోబుక్ ల్యాప్‌టాప్‌లను తయారు చేస్తోంది. ఎక్స్‌డిఎ డెవలపర్స్ నివేదిక ప్రకారం జియోబుక్ లాంచ్ 2021 మొదటి భాగంలో ఉంటుందని భావిస్తున్నారు. జియో ల్యాప్‌టాప్ అసలు ఫోటో ఇంకా వెల్లడించనప్పటికీ జియోబుక్ నమూనా బయటపడింది.
లీకైన ల్యాప్‌టాప్ ఫోటోలో విండోస్ కీలు ఉన్నట్లు చూపిస్తుంది, కాని ఇప్పటివరకు లీక్ అయిన రిపోర్ట్ ప్రకారం ఈ ల్యాప్‌టాప్‌లో విండోస్ కనిపించదు. ఫీచర్ల గురించి చెప్పాలంటే జియోబుక్ 720 పిక్సెల్ రిజల్యూషన్‌తో హెచ్‌డి డిస్‌ప్లేను పొందుతుంది. అలాగే స్నాప్‌డ్రాగన్ ఎక్స్ 12 4జి మోడెమ్ సపోర్ట్‌తో స్నాప్‌డ్రాగన్ 665 ప్రాసెసర్ లభిస్తుంది.
జియోబుక్‌లో 2 జిబి ఎల్‌పిడిడిఆర్ 4 ఎక్స్ ర్యామ్‌తో 32 జిబి స్టోరేజ్ లభిస్తుంది. ఇందులో రెండవ మోడల్ కూడా రావచ్చు దీనిలో 64 జీబీ స్టోరేజ్ 4 జీబీ ర్యామ్‌తో లభిస్తుంది. కనెక్టివిటీ కోసం ల్యాప్‌టాప్‌లో మినీ హెచ్‌డిఎంఐ కనెక్టర్, డ్యూయల్-బ్యాండ్ వై-ఫై, బ్లూటూత్, క్వాల్కమ్ ఆడియో చిప్ ఉంటుంది.
జియో స్టోర్, జియో మీట్, జియో పేజెస్ వంటి యాప్స్ జియోబుక్ ల్యాప్‌టాప్‌లో ముందే ఇన్‌స్టాల్ చేయబడతాయి. మరో వైపు జియోబుక్ లేదా ఇతర ల్యాప్‌టాప్‌ల గురించి జియో అధికారికంగా స్పందించలేదు.

Latest Videos

click me!