అలాగే ఇండియాలో పబ్-జి మొబైల్ రిజిస్ట్రేషన్లు, లాంచ్ కి సంబంధించి ఇప్పటివరకు పలు నివేదికలు కూడా వెలువడ్డాయి, కానీ అధికారికంగా ధృవీకరించలేదు.
undefined
ఇప్పుడు దీనికి సంబంధించి ఒక కొత్త నివేదిక వెలువడింది, ఇందులో పబ్-జి మొబైల్ త్వరలో భారతదేశంలో తిరిగి ప్రారంభించబోతున్నట్లు తెలిపింది, కానీ రిలంచ్ తేదీని రహస్యంగా ఉంచారు. భారతదేశంలో పబ్‌జి మొబైల్‌ను బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా పేరిట ఉండవచ్చని ఈ కొత్త నివేదికలో వెల్లడైంది. పబ్-జి సంస్థ ఫేస్‌బుక్ పేజీ, యూట్యూబ్ ఛానెల్ పేరును కూడా మార్చింది.
undefined
గత వారం పబ్-జి మొబైల్ ఇండియా అధికారిక యూట్యూబ్ ఛానెల్‌లో ఒక టీజర్ కూడా విడుదలైంది, కాని కొద్దిసేపటికే దానిని తొలగించారు. చాలా మంది వినియోగదారులు వీడియోను తొలగించినట్లు స్క్రీన్ షాట్లను కూడా షేర్ చేశారు.
undefined
"ఆల్ న్యూ పబ్ మొబైల్ కమింగ్ టు ఇండియా" ట్యాగ్ లైన్ తో క్రాఫ్టన్ పబ్-జి మొబైల్ రిలాంచ్ టీజర్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో విడుదల చేసింది. షేర్ విత్ యువర్ స్క్వాడ్‌మేట్స్ నవ్ అనే క్యాప్షన్ కూడా పెట్టారు. కొన్ని నెలలు క్రితం కంపెనీ స్థానిక ప్రభుత్వ నిబంధనల ప్రకారం డేటాను భద్రపరుస్తామని ఒక ప్రకటనలో తెలిపింది. అలాగే డేటాని కూడా లోకల్ డేటా సెంటర్‌లోనే స్టోర్ చేయబడుతుందిని వెల్లడించింది.
undefined