దీని ఫీచర్స్ గురించి మాట్లాడితే ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, పంచ్‌హోల్ డిస్ ప్లేతో తీసుకొచ్చారు. ఒప్పో ఎ53 రియల్‌మే 6, శామ్‌సంగ్ గెలాక్సీ ఎం 31, రెడ్‌మి నోట్ 9 ప్రో వంటి స్మార్ట్‌ఫోన్‌లతో పోటీపడుతుంది.
undefined
ఒప్పో ఎ53 2020 కొత్త ధరఫ్లిప్‌కార్ట్ ప్రకారం ఒప్పో ఎ53 4 జిబి ర్యామ్‌తో 64 జిబి స్టోరేజ్ వేరియంట్ ధర రూ .10,990. అంతకుముందు దీని ధర రూ .12,990 అంటే ఈ మోడల్ ధరపై రూ .2,000 తగ్గించారు. 6 జీబీ ర్యామ్‌తో 128 జీబీ స్టోరేజ్ వేరియంట్‌ను రూ .12,990 కు కొనుగోలు చేయవచ్చు, అయితే ఇండియాలో ఈ ఫోన్ ని రూ .15,490 వద్ద లాంచ్ చేశారు. ఈ స్మార్ట్‌ఫోన్ ఎలక్ట్రిక్ బ్లాక్, ఫెర్రీ వైట్, ఫాన్సీ బ్లూ కలర్ ఆప్షన్స్‌తో లభిస్తుంది. అయితే ఈ కొత్త ధర ఆఫర్ ఎప్పటి వరకు ఉంటుంది అనే దానిపై స్పష్టత లేదు.
undefined
ఒప్పో ఎ53 2020 స్పెసిఫికేషన్లుఒప్పో ఎ53 2020లో 6.5-అంగుళాల హెచ్‌డి ప్లస్ డిస్ ప్లే, స్క్రీన్ రిజల్యూషన్ 720x1,600 పిక్సెళ్ళు, 90Hz రిఫ్రెష్ రేట్, ఆక్టాకోర్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 460 ప్రాసెసర్, కలర్‌ఓఎస్ 7.2 ఆండ్రాయిడ్ 10 తో పనిచేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 4 జీబీ 64 జీబీ, 6 జీబీ 128 జీబీ రెండు వేరియంట్లలో లభిస్తుంది. అలాగే మైక్రో ఎస్‌డి కార్డ్ ద్వారా 256 జిబి వరకు స్టోరేజ్ పెంచుకోవచ్చు.
undefined
ఒప్పో ఎ53 2020 కెమెరాఒప్పో ఎ53 2020 వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్ ఇచ్చారు, వెనుక భాగంలో 13 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ కెమెరా , 2 మెగాపిక్సెల్ డీప్ సెన్సార్, 2 మెగాపిక్సెల్ సెన్సార్‌తో f2.4 మాక్రో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీల కోసం ఎఫ్ 2.0 లెన్స్‌తో 16 మెగాపిక్సెల్ సెన్సార్ కెమెరా లభిస్తుంది.
undefined
ఒప్పో ఎ53 2020 బ్యాటరీఒప్పో ఎ53 2020 లో 5,000mAh శక్తివంతమైన బ్యాటరీ, 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 4జి VoLTE, Wi-Fi, బ్లూటూత్, GPS A-GPS, USB టైప్-సి తో 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ అందించారు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ వెనుక భాగంలో ఇచ్చారు.
undefined