పబ్-జి ఈజ్ బ్యాక్ : బ్యాటిల్ గ్రౌండ్ పేరుతో ఇండియాలోకి రిఎంట్రీ .. ప్లేస్టోర్ లో ప్రీ-రిజిస్ట్రేషన్లు ప్రారంభం

First Published | May 18, 2021, 12:19 PM IST

పబ్-జి మొబైల్ ఇండియా  ఇప్పుడు బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా పేరితో భారతదేశంలోకి తిరిగి రాబోతుంది. దీనికి సంబంధించి సంస్థ ఇటీవల పబ్-జిమొబైల్ ఇండియా అన్ని సోషల్ మీడియా పేజీల పేరును మార్చింది అలాగే రిజిస్ట్రేషన్లను  కూడా ప్రకటించింది. 

బ్యాటిల్ గ్రౌండ్ కోసం రిజిస్ట్రేషన్లు గూగుల్ ప్లే-స్టోర్ నుండి చేసుకోవచ్చు, అయితే గేమ్ లాంచ్ గురించి కంపెనీ ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. గత ఏడాది 2020 సెప్టెంబర్‌లో 118 యాప్‌లతో పాటు భారతదేశంలో పబ్‌జి మొబైల్‌ను నిషేధించిన సంగతి మీకు తెలిసిందే. ఈ గేమ్ రిజిస్ట్రేషన్లు, నియమాల గురించి వివరంగా తెలుసుకుందాం ...
undefined
మీరు గూగుల్ ప్లే స్టోర్‌లో బాటిల్‌గ్రౌండ్స్ మొబైల్ ఇండియా పేరుతో గేమ్ సెర్చ్ చేయవచ్చు. అయితే ఈ పేరుతో ఇప్పటికే చాలా యాప్స్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉన్నాయి. అయితే మీరు క్రాఫ్టన్. ఇంక్ పేరుతో ఉన్నదానిని మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే క్రాఫ్టన్ ఈ గేమ్ ను అభివృద్ధి చేసింది. గేమ్ సెర్చ్ చేసిన తరువాత మీరు 'ప్రీ-రిజిస్టర్' బటన్‌ను చూస్తారు, దానిపై క్లిక్ చేయడం ద్వారా మీరు గేమ్ కోసం ప్రీ రిజిస్టర్ చేసుకోవచ్చు. ప్రీ-రిజిస్ట్రేషన్ ప్లేయర్‌లకు రెకాన్ మాస్క్, రీకాన్ అవుట్‌ఫిట్, సెలబ్రేషన్ ఎక్స్‌పర్ట్ టైటిల్, 300 ఎజిలతో సహా నాలుగు ప్రత్యేక ఈవెంట్‌లు లభిస్తాయని క్రాఫ్టన్ తెలిపింది.
undefined

Latest Videos


ఇటీవల సంస్థ పబ్-జి మొబైల్ పాపులర్ సాన్‌హోక్ మ్యాప్‌ను ఫేస్‌బుక్ పోస్ట్ ద్వారా చూపించింది, అంటే ఈ మ్యాప్ కొత్త గేమ్‌లో కూడా కనిపిస్తుంది. ఎప్పటికప్పుడు గేమ్ లో కొత్త కంటెంట్ చేర్చబడుతుందని కంపెనీ తెలిపింది. అయితే బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా పబ్-జితో సమానంగా ఉంటుందని భావిస్తున్నారు.
undefined
డేటా గోప్యత, డేటా భద్రతకు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నామని అలాగే భారతప్రభుత్వ నియమాలకు కట్టుబడి ఉన్నానని క్రాఫ్టన్ పేర్కొంది. డేటా భద్రత కోసం కంపెనీ ఇతర సంస్థలతో కలిసి పనిచేస్తోంది. బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా గేమర్ల పూర్తి డేటా భారత డేటా సెంటర్‌లోనే స్టోర్ చేయబడుతుందని, ఇది భారత ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉంటుందని కంపెనీ తెలిపింది.
undefined
18 ఏళ్లలోపు వారు ఈ గేమ్ ఆడలేరని, ఒకవేళ వారు ఆడాలనుకుంటే వారు తమ తల్లిదండ్రుల మొబైల్ నంబర్‌ను కంపెనీతో పంచుకోవలసి ఉంటుందని కంపెనీ స్పష్టంగా పేర్కొంది. కొత్త గేమ్ లో కంపెనీ చేసిన అతిపెద్ద మార్పు ఇది. సంస్థ ఈ నిర్ణయం వెనుక ఉన్న అతి పెద్ద కారణం ఏమిటంటే, గత సంవత్సరం పబ్‌జి మొబైల్ నిషేధం కారణంగా ఇది మొదట హింసాత్మక గేమ్ అని విమర్శలు ఎదుర్కొంది.
undefined
click me!