వేటింగ్ ఈజ్ ఓవర్ : క్లబ్‌హౌస్ ఆండ్రాయిడ్ యాప్ వచ్చేస్తోంది.. దీని ప్రత్యేకతలు ఎంటో తెలుసుకోండి..

First Published May 17, 2021, 12:55 PM IST

సోషల్ మీడియా ప్లాట్‌ఫాం క్లబ్‌హౌస్ ఈ వారంలో భారతదేశంతో పాటు ఇతర దేశాలలో లాంచ్ కానుంది. ఈ వారం చివరి నాటికి క్లబ్‌హౌస్ ఆండ్రాయిడ్ వెర్షన్‌ను భారత్, బ్రెజిల్‌తో సహా పలు దేశాల్లో విడుదల చేయనున్నట్లు కంపెనీ ట్వీట్ చేసింది. 

క్లబ్‌హౌస్ ట్వీట్‌లో బ్రెజిల్, జపాన్, రష్యాలోని క్లబ్‌హౌస్ ఆండ్రాయిడ్ యాప్ మంగళవారం అంటే మే 18న విడుదల కానుండగా, నైజీరియా, ఇండియాలో శుక్రవారం, ఇతర దేశాలలో శనివారం లేదా ఆదివారం విడుదల చేయనున్నట్లు తెలిపింది.
undefined
గతవారం యూ‌.ఎస్ లోని ఎంపిక చేసిన వినియోగదారుల కోసం క్లబ్‌హౌస్ బీటా వెర్షన్ ప్రారంభించారు. క్లబ్‌హౌస్ ఆండ్రాయిడ్ వెర్షన్ ఇండియా లాంచ్ సెలెక్టెడ్ యూజర్లు లేదా అందరికీ పై కంపెనీ ఇంకా పూర్తిగా స్పష్టం చేయలేదు. ఎందుకంటే యు.ఎస్‌లో ఇంగ్లీష్ యూజర్స్ ఆధారంగా మాత్రమే ఆహ్వానిచ్చింది.
undefined
క్లబ్‌హౌస్ గత ఏడాది ఏప్రిల్‌లో ప్రారంభించారు. ఫిబ్రవరి 2021 నాటికి దీనిని 10 మిలియన్ల మంది డౌన్‌లోడ్ చేశారు. ఈ సమాచారాన్ని యాప్ ఇంటెలిజెన్స్ సంస్థ సెన్సార్ టవర్ ఇచ్చింది. ఈ నెల ప్రారంభంలో క్రియేటర్స్ సంపాదించడానికి వీలుగా మోనటైజేషన్ ఫీచర్ ని కూడా కంపెనీ ప్రారంభించింది. క్లబ్‌హౌస్ కి పోటీగా ట్విట్టర్ స్పేస్ అనే ఆడియో ప్లాట్‌ఫామ్‌ను కూడా ప్రవేశపెట్టింది.
undefined
మల్టీమీడియా ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ ఇటీవల టెలిగ్రామ్ వాయిస్ చాట్స్ 2.0 అనే ఫీచర్‌ను విడుదల చేసింది, ఇది ఆడియో ఓన్లీ చాటింగ్ ప్లాట్‌ఫామ్. ఇందులో ఎంతమందితోనైన వాయిస్ కాల్స్ చేయవచ్చు.
undefined
click me!