ప్రస్తుతం చాలా రకాల ఆక్సిమీటర్లను మార్కెట్లో విక్రయిస్తున్నారు. ప్రజలు అందుబాటులో ఉన్న ఆక్సిమీటర్లను కొనుగోలు చేస్తున్నారు, కానీ మార్కెట్లో చాలా నకిలీ ఆక్సిమీటర్లు కూడా ఉన్నాయని తెలిస్తే మీకు ఆశ్చర్యం కలిగిస్తుంది, వాటిని కొనుగోలు చేయడం లేదా ఉపయోగించడం మీకు ప్రమాదకరం.
undefined
ఆక్సిమీటర్ కొనేటప్పుడు గుర్తుంచుకోవలసిన కొన్ని ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. అయితే ఆక్సిమీటర్ ఎందుకు ఉపయోగిస్తారంటే బ్లడ్ ఆక్సిజన్(ఎస్‌పిఓ2) గురించి సమాచారం తెలుసుకోవడానికి. అయితే దీని గురించి పూర్తిగా తెలుసుకుందాం ...
undefined
మొదట మార్కెట్లో ఎలాంటి ఆక్సిమీటర్లు ఉన్నాయో తెలుసుకోవాలి. అయితే వీటిలో ఫింగర్‌టిప్ పల్స్ ఆక్సిమీటర్, హ్యాండ్‌హెల్డ్, ఫెమోరల్ పల్స్ ఆక్సిమీటర్‌తో సహా మొత్తం మూడు రకాల ఆక్సిమీటర్లు ఉన్నాయి.ఫింగర్‌టిప్ పల్స్ ఆక్సిమీటర్ గృహ వినియోగానికి చాలా మంచిది. ఫింగర్‌టిప్ పల్స్ ఆక్సిమీటర్‌ను రూ.700 ప్రారంభ ధరకు కొనుగోలు చేయవచ్చు.
undefined
ఆక్సిమీటర్ కొనుగోలు చేసేటప్పుడు, దాని ఆక్యురసీ పై శ్రద్ధ చూపించాలి. మీరు ఏదైనా దుకాణం నుండి కొనుగోలు చేస్తుంటే ముందుగా చెక్ చేయండి ఇంకా ఆన్‌లైన్ లో ధాని ధర, రివ్యూ, బ్రాండ్ గురించి తెలుసుకోండిఆక్సిమీటర్లలో నాణ్యత కోసం ఎఫ్‌డిఏ, ఆర్‌ఓహెచ్‌ఎస్, సిఈ వంటి సర్టిఫికేషన్ అందుబాటులో ఉన్నాయి. వీటి కారణంగా డివైజ్ ఆక్యురసీ, నాణ్యతను నమ్మవచ్చు.
undefined
ఆక్సిమీటర్ డిస్ ప్లే పై కూడా ప్రత్యేక శ్రద్ధ వహించండి. డిస్ ప్లే శుభ్రంగా, స్పష్టంగా ఉండాలి. లో బ్యాటరీ ఇండికేషన్, ఆడియో-విజువల్ అలారం వంటి ఫీచర్స్ ఆక్సిమీటర్‌లో అందుబాటులో ఉన్నాయి.
undefined
ఆక్సిమీటర్‌ను ఎలా ఉపయోగించాలీఆక్సిమీటర్ సహాయంతో బ్లడ్ ఆక్సిజన్ లెవెల్ ని ప్రతి పదినిమిషాల ఒకసారి చెక్ చేయవచ్చు. కింద పడుకున్నప్పుడు ఆక్సిమీటర్ వాడకండి. నిటారుగా కూర్చుని అరచేతిని గుండె ఎత్తులో ఉంచడం ద్వారా దీనిని ఉపయోగించడం మంచిది. చూపుడు వేలు ముందు ఆక్సిమీటర్ ఉంచాలి. ఆక్సిమీటర్ ఉపయోగిస్తున్నప్పుడు కదలకండి. మొదటి కాకుండా పదినిమిషాల తదుపరి చూపించే రీడింగులపై ఆధారపడవచ్చు.
undefined