మొబైల్ యాప్ ద్వారా పనిచేసే సరికొత్త ఫ్యాన్.. ఇప్పుడు 65% వరకు కరెంటు బిల్లు కూడా ఆదా చేస్తుంది..

First Published | Jun 17, 2021, 4:26 PM IST

చిన్న ఇల్లు, వంటగది ఉపకరణాల తయారీలో అగ్రగామిగా ఉన్న ఆర్పెట్ గ్రూప్ మనీసేవర్ అనే కొత్త రేంజ్ ఫ్యాన్ ని భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఆర్పెట్ నుండి వస్తున్న ఈ మనీసేవర్ స్మార్ట్ ఫ్యాన్ ప్రారంభ ధర రూ .3,100. 'మనీసేవర్' స్మార్ట్ ఫ్యాన్ బిఎల్‌డిసి (బ్రష్‌లెస్ డిసి) టెక్నాలజీపై పనిచేస్తుందని కంపెనీ తెలిపింది. 

విద్యుత్ వినియోగాన్ని తగ్గించడంలో బిఎల్‌సిడి టెక్నాలజీ సహాయపడుతుందని వెల్లడించింది. సంస్థ ప్రకారం ఈ మనీసేవర్ ఫ్యాన్ ఉపయోగించడం వలన విద్యుత్ బిల్లును 65 శాతం వరకు తగ్గించవచ్చు.
undefined
ఈ సిరీస్ లో అన్నీ ఫ్యాన్లకు 5 స్టార్ రేటింగ్ లభించింది. కంపెనీ ప్రకారం ఒక సాధారణ ఫ్యాన్ 75 వాట్ల విద్యుత్తును వినియోగిస్తుండగా మనీసేవర్ ఫ్యాన్ 28 వాట్స్ మాత్రమే వినియోగిస్తుంది అని తెలిపింది. విద్యుత్ వినియోగాన్ని తగ్గించడం వల్ల సంవత్సరానికి విద్యుత్ బిల్లులపై 65 శాతానికి పైగా ఆదా చేస్తుంది అని పేర్కొంది.
undefined

Latest Videos


మనీసేవర్ ఫ్యాన్ సాధారణ ఇన్వర్టర్ మౌంటెడ్ ఫ్యాన్ కంటే మూడు రెట్లు మెరుగ్గా పనిచేస్తుంది ఇంకా వోల్టేజ్ హెచ్చుతగ్గుల నుండి రెండు రెట్లు సురక్షితం కూడా. అలాగే బూస్ట్ మోడ్‌లో కరెంట్ వోల్టేజ్ 160 వోల్ట్‌లకు పడిపోతే లేదా 260 వోల్ట్‌లకు పెరిగిన ఫ్యాన్ 370-380 ఆర్‌పిఎమ్ వద్ద నడుస్తూనే ఉంటుంది. దీనితో పాటు గాలి తగ్గుదల కూడా ఉండదు.
undefined
ఈ ఫ్యాన్ ని మొబైల్ యాప్ నుండి కూడా ఆపరేట్ చేయవచ్చు. యాప్ ని ఫ్యాన్ రిమోట్‌గా కూడా ఉపయోగించవచ్చు. ఇప్పుడు మీకు ఫ్యాన్ కంట్రోల్ చేయడానికి రెగ్యులేటర్ అవసరం ఉండదు.
undefined
మనీసేవర్ స్మార్ట్ ఫ్యాన్ ఎల్ఈడి లైట్, స్మార్ట్ రిమోట్ విత్ స్లీప్ మోడ్, బూస్టర్ అండ్ టైమర్ మోడ్ తో వస్తుంది. ఈ ఫ్యాన్ 99.2% వరకు సూక్ష్మక్రిముల నుండి రక్షిస్తుందని కంపెనీ పేర్కొంది.
undefined
undefined
click me!