శాంసంగ్ ఈ సంవత్సరం సెప్టెంబర్‌లో 200-మెగాపిక్సెల్ ISOCELL HP1 సెన్సార్‌ను పరిచయం చేసింది. మోటోరోల కాకుండా షియోమీ(Xiaomi) కూడా 200 మెగాపిక్సెల్ కెమెరాతో ఫోన్‌లను విడుదల చేస్తున్న కంపెనీల జాబితాలో ఉంది. షియోమీ లాంచ్ ప్లాన్ కూడా వచ్చే ఏడాది మాత్రమే. అంతేకాకుండా 2023 నాటికి 200 మెగాపిక్సెల్ కెమెరాతో కూడిన ఫోన్‌ను కూడా పరిచయం చేయడానికి శాంసంగ్ సన్నాహాలు చేస్తోంది. శాంసంగ్ 200-మెగాపిక్సెల్ ISOCELL సెన్సార్‌లోని పిక్సెల్‌ల సైజ్ 0.64 మైక్రాన్‌లు. ఈ లెన్స్ ద్వారా వినియోగదారులు 12.5-200 మెగాపిక్సెల్ రిజల్యూషన్ మధ్య ఫోటోలను క్లిక్ చేయగలరు.