ట్రుకాలర్ లో వస్తున్న లేటెస్ట్ ఫీచర్లు ఇవే.. ఇప్పుడు ఎవరు కాల్ చేశారో కూడా యాప్ తెలియజేస్తుంది..

First Published | Nov 26, 2021, 11:54 AM IST

కాలర్ ఐడెంటిఫికేషన్ ఫీచర్స్ తో స్మార్ట్ ఫోన్ యాప్ ట్రుకాలర్  (Truecaller) పన్నెండవ ఎడిషన్‌ను తాజాగా ప్రారంభించింది. కొత్త అప్ డేట్ తో మీరు ఎన్నో కొత్త ఫీచర్‌లను పొందడమే కాకుండా, కొత్త డిజైన్‌ను కూడా చూస్తారు. 

ట్రుకాలర్ యాప్ ఇప్పటికీ కాల్ అలర్ట్‌లు, కాల్ రీజియన్, ఫుల్ స్క్రీన్ కాలర్ ఐ‌డి, ఇన్‌బాక్స్ క్లీనర్, ఎస్‌ఎం‌ఎస్/కాంటాక్ట్ బ్యాకప్, స్మార్ట్ ఎస్‌ఎం‌ఎస్ వంటి ఎన్నో ఫీచర్లను అందిస్తుంది.ఈ  యాప్ ఇప్పుడు 46 భాషలకు సపోర్ట్ చేస్తుంది. వీడియో కాలర్ ఐడితో కొత్త ఇంటర్‌ఫేస్, కాల్ రికార్డింగ్, ఘోస్ట్ కాల్, కాల్ అనౌన్స్‌మెంట్ (ఫోన్  రాగానే యాప్ ఎవరి నుంచి ఫోన్ వచ్చిందో తెలియజేస్తుంది) వంటి కొత్త ఫీచర్లను ఈసారి కంపెనీ అందించింది. రాబోయే వారాల్లో భారతదేశంతో సహా అనేక దేశాలలో అండ్రాయిడ్ (android) వినియోగదారుల కోసం అప్ డేట్ విడుదల చేయనుంది.

ట్రుకాలర్  లో కొత్త ఫీచర్లు 
వీడియో కాలర్ ఐ‌డి- వీడియో కాలర్ ఐ‌డి అనేది ఒక ఫన్నీ ఫీచర్, దీంతో మీరు మీ స్నేహితులు లేదా కుటుంబ సభ్యులకు కాల్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా ప్లే అయ్యే చిన్న వీడియోను సెటప్ చేయడానికి  అనుమతిస్తుంది. మీరు ఇంటర్నల్ వీడియో టెంప్లేట్‌ల నుండి ఒకదాని సెలెక్ట్ చేసుకోవచ్చు లేదా రికార్డ్ చేసి మీ స్వంతంగా సెట్ చేసుకోవచ్చు. 

Latest Videos


కొత్త ఇంటర్‌ఫేస్ -  ప్రత్యేక ట్యాబ్‌లతో మీరు ఇప్పుడు మీ ఎస్‌ఎం‌ఎస్, ట్రూకాలర్ గ్రూప్ చాట్‌లు, ప్రైవేట్ చాట్‌లను కేవలం ఒక్క ట్యాప్‌తో యాక్సెస్ చేయవచ్చు.

కాల్ రికార్డింగ్ -  కాల్ రికార్డింగ్ మొదట ప్రీమియం ఫీచర్‌గా మాత్రమే అందించింది, కానీ ఇప్పుడు ఉచితంగా విడుదల చేసింది. ఇప్పుడు ఏ ఆండ్రాయిడ్ యూజర్ అయినా ట్రూకాలర్‌లో కాల్‌లను ఉచితంగా రికార్డ్ చేయవచ్చు. కాల్ రికార్డింగ్‌తో మీరు అన్ని ఇన్‌కమింగ్ అండ్ అవుట్‌గోయింగ్ కాల్‌లను రికార్డ్ చేయవచ్చు. అన్ని రికార్డింగ్‌లు డివైజ్ స్టోరేజ్ లో స్టోర్ చేయబడతాయి అలాగే వీటిని ట్రుకాలర్  ద్వారా యాక్సెస్ చేయబడదు.

ఘోస్ట్ కాల్ - ఘోస్ట్ కాల్ అనేది ట్రుకాలర్  లో ప్రాంక్ కాల్ ఫీచర్. మీరు ఘోస్ట్ కాల్ ద్వారా మీ స్నేహితులతో సరదాగా గడపవచ్చు. ఘోస్ట్ కాల్‌తో మీరు ఎవరైనా  వ్యక్తి నుండి మీకు కాల్ వస్తున్నట్లు కనిపించేలా ఏదైనా పేరు, నంబర్, ఫోటోను సెట్ చేయవచ్చు. మీకు కావాలంటే మీరు మీ ఫోన్‌బుక్ నుండి కేవలం ఒక నంబర్‌ను ఎంచుకోవచ్చు. ట్రూకాలర్ ప్రీమియం, గోల్డ్ సబ్‌స్క్రైబర్‌లకు మాత్రమే ఘోస్ట్ కాల్‌ ఫీచర్ అందుబాటులో ఉంటాయి.

కాల్ అనౌన్స్ - మీరు ఈ కొత్త ఫీచర్‌ని ఎనేబుల్ చేస్తే, ఇన్‌కమింగ్ కాల్స్ వచ్చినప్పుడు ట్రుకాలర్  మీకు తెలియజేస్తుంది. ఈ ఫీచర్ సాధారణ వాయిస్ కాల్‌లు లేదా ట్రూకాలర్ హెచ్‌డి వాయిస్ కాల్‌లు రెండింటిలోనూ పని చేస్తుంది. ఈ ఫీచర్ వైర్‌లెస్ హెడ్‌ఫోన్‌లకు కూడా సపోర్ట్ ఇస్తుంది.
 

click me!