ఒప్పో ఇన్నో డే 2021 : వచ్చే వారం ఈవెంట్‌లో లాంచ్ కానున్న లేటెస్ట్ ప్రాడెక్ట్స్ ఇవే..

First Published | Dec 4, 2021, 1:25 PM IST

చైనా కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ అండ్ మొబైల్ టేలికమ్యూనికేషన్  సంస్థ ఒప్పో (OPPO )ఆన్యువల్ ఈవెంట్ ఈ సంవత్సరం డిసెంబర్ రెండవ వారంలో జరగబోతోంది. దీనిని కంపెనీ అధికారికంగా ధృవీకరించింది. రెండు రోజుల పాటు జరిగనున్న ఈ ఈవెంట్‌లో ఒప్పో చాలా ఉత్పత్తులు లాంచ్ అవుతాయని భావిస్తున్నారు. 

 ఒప్పో ఈ ఈవెంట్ వర్చువల్ మాత్రమే జరగనుంది. ఒప్పో  ఈ ఈవెంట్‌లో లాంచ్ చేయబోయే ఉత్పత్తుల జాబితా ఇంకా వెల్లడి కాలేదు, అయితే కంపెనీ మొదటి ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ ఈ ఈవెంట్‌లో లాంచ్ చేయబడుతుందని భావిస్తున్నారు. 2020 ఈవెంట్‌లో కంపెనీ మూడు కాన్సెప్ట్ ఉత్పత్తులను పరిచయం చేసింది.
 

ఈ  ఒప్పో ఇన్నో డే 2021(Oppo Inno Day 2021) ఈవెంట్ డిసెంబర్ 14-15 తేదీలలో చైనాలోని షెన్‌జెన్ నగరంలో నిర్వహించనుంది. డిసెంబర్ 14 మధ్యాహ్నం 1.30 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. సందర్శకులు ఒప్పో సంస్థ వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా ఈవెంట్ కోసం రిజిస్టర్ చేసుకోవచ్చు.

Latest Videos


ఒక చైనీస్ టిప్‌స్టర్ WHYLAB ఒప్పో  ఫోల్డబుల్ ఫోన్  స్క్రీన్‌షాట్‌ను షేర్ చేసింది. అంతే కాకుండా ఫోల్డబుల్ ఫోన్ కోసం చైనా ప్రభుత్వం అందుకున్న సర్టిఫికేట్  ఫోటో కూడా బయటపడింది. ఒప్పో  ఫోల్డబుల్ ఫోన్‌కు "PEUM00" అనే కోడ్‌నేమ్ ఉంది.

ఇంతకుముందు లీక్ అయిన నివేదికల ప్రకారం కంపెనీ ఫోల్డబుల్ ఫోన్ ఒప్పో ఫైండ్ ఎన్ 5జి(Oppo Find N 5G)గా పరిచయం చేయనుంది, అయితే ఒప్పో ఈ విషయంపై ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన చేయనప్పటికీ  ఫోల్డబుల్ ఫోన్ ఈ పేరు పొందుతుందని చెబుతున్నారు. 120Hz రిఫ్రెష్ రేట్‌తో 8-అంగుళాల LTPO డిస్‌ప్లే అలాగే రెండవ డిస్‌ప్లే 60Hz రిఫ్రెష్ రేట్‌తో ఫోల్డ్ పైన ఉంటుంది. ఫోన్‌ను స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్‌తో లాంచ్ చేయవచ్చు.

అంతేకాకుండా అండ్రాయిడ్ 11(Android 11) ఆధారిత  కలర్ ఓఎస్(ColorOS)ఫోన్‌తో వస్తుంది. దీనికి మూడు వెనుక కెమెరాలు ఉంటాయి, దీని ప్రైమరీ కెమెరా 50-మెగాపిక్సెల్ సోనీ IMX766 సెన్సార్‌, రెండవ లెన్స్ 16 మెగాపిక్సెల్స్, మూడవ లెన్స్ 13 మెగాపిక్సెల్స్ Samsung ISOCELL SK3M5 సెన్సార్ ఇచ్చారు. ముందు భాగంలో 32-మెగాపిక్సెల్ కెమెరాను మీరు చూడవచ్చు.

click me!