మరింత వేగంతో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ కొత్త ప్రాసెసర్.. ఒప్పో మొదటి ఫోన్‌తో లాంచ్..

First Published | Dec 3, 2021, 1:35 PM IST

ప్రముఖ చిప్‌సెట్ తయారీదారు క్వాల్ కం (Qualcomm)కొత్త ప్రాసెసర్ స్నాప్‌డ్రాగన్  8th Gen 1ని విడుదల చేసింది. దీనిని ఆన్యువల్ స్నాప్‌డ్రాగన్ టెక్ సమ్మిట్‌లో ప్రారంభించారు. స్నాప్‌డ్రాగన్  8 Gen 1 అనేది అండ్రాయిడ్ (Android) డివైజెస్ కోసం 5జి ప్రాసెసర్. స్నాప్‌డ్రాగన్ బ్రాండింగ్‌తో పరిచయం చేసిన క్వాల్ కం నుండి వస్తున్న మొదటి ప్రాసెసర్.

ఈ ప్లాసెసర్ స్నాప్‌డ్రాగన్ 888 కంటే 4 రెట్లు వేగంగా ఉంటుందని స్నాప్‌డ్రాగన్ 8 Gen 1 గురించి క్లెయిమ్ చేసింది. దీనికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సపోర్ట్ కూడా ఉంది. అలాగే గ్రాఫిక్స్ పరంగా 30 శాతం వేగంగా ఉంటుంది. అంతేకాకుండా 25 శాతం ఎక్కువ పవర్ ఆదా చేస్తుంది. స్నాప్‌డ్రాగన్ 8 Gen 1 10 గిగాబైట్ల వేగంతో 5G మోడెమ్ RF సొల్యూషన్‌తో ప్రపంచంలోనే మొట్టమొదటి ప్రాసెసర్‌గా పేర్కొంది.

స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1తో మొదటి ఫోన్‌ 
స్నాప్‌డ్రాగన్ snapdragon 8 జెన్ 1 ప్రాసెసర్‌తో మొదటి ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయనున్నట్లు ఒప్పో (oppo)తెలిపింది. ఈ ప్రాసెసర్‌తో  ఒప్పో మొదటి ఫోన్ 2022 మొదటి త్రైమాసికంలో ప్రారంభించనుంది. అంతే కాకుండా ఈ ప్రాసెసర్ బ్లాక్ షార్క్, హానర్, ఐకూ, మోటోరోల, నూబీయ, వన్ ప్లస్, ఒప్పో, రియమ్ మీ, రెడ్ మీ, సోని, వివో, షియోమీ, జెడ్‌టి‌ఈ వంటి స్నాప్‌డ్రాగన్ Snapdragon 8 Gen 1 కంపెనీల ఫోన్‌లలో కూడా కనిపిస్తుంది. 

Latest Videos


Snapdragon 8 Gen 1 స్పెసిఫికేషన్‌లు
Snapdragon 8th Gen 1 7th జంరేషన్ క్వాల్ కం ఏ‌ఐ ఇంజిన్‌తో అమర్చబడి ఉంటుంది, దీని మెమరీ షేరింగ్ రెండు రెట్లు ఎక్కువ అని తెలిపింది. కొత్త ప్రాసెసర్ 4 నానోమీటర్ ప్రాసెస్‌లో నిర్మించబడింది. గత సంవత్సరం ప్రారంభించిన స్నాప్‌డ్రాగన్ 888 5 నానోమీటర్ ప్రాసెస్ లో తయారు చేయబడింది. కానీ కంపెనీ సి‌పి‌యూ, జి‌పి‌యూ గురించి సమాచారాన్ని అందించలేదు.

click me!