ట్విట్టర్ లో మీకు ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నారా.. అయితే బ్లూ టిక్ కోసం ఇలా చేయండి..

First Published May 21, 2021, 1:47 PM IST

 దాదాపు మూడు సంవత్సరాలు నిరీక్షణ తరువాత ట్విట్టర్ చివరకు పబ్లిక్ వెరిఫికేషన్ ప్రారంభించింది. ఇప్పుడు ఎవరైనా  వారి ట్విట్టర్ ఖాతా వేరిఫై కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. 2017 సంవత్సరంలో ట్విట్టర్ పబ్లిక్ వెరిఫికేషన్ నిలిపివేసింది. 

కొత్త వెరిఫికేషన్ ప్రక్రియను త్వరలో అందరికీ విడుదల చేయనున్నట్లు ట్విట్టర్ తెలిపింది. గత వారం ప్రారంభంలో రివర్స్ ఇంజనీరింగ్ నిపుణుడు జేన్ మంచున్ వాంగ్ ట్వీట్ ద్వారా ట్విట్టర్ వెరిఫికేషన్ గురించి సమాచారం ఇచ్చారు. పబ్లిక్ అకౌంట్ వెరిఫికేషన్ సన్నాహాలు చివరి దశలో ఉన్నాయని, త్వరలో ప్రత్యక్ష ప్రసారం చేస్తామని చెప్పారు. దీనికి సంబంధించి అతను స్క్రీన్ షాట్ కూడా షేర్ చేశాడు.
undefined
అక్కౌంట్ వెరిఫికేషన్ ఎవరికి ఉంటుంది?ప్రారంభ దశలో ప్రభుత్వ సంస్థలు, బ్రాండ్లు, నాన్ ప్రాఫిట్ సంస్థలు, న్యూస్, ఎంటర్టైన్మెంట్, స్పొర్ట్స్, ఆర్గనైజర్స్, ఇతర ప్రభావవంతమైన వ్యక్తులతో సహా ఆరు రకాల ఖాతాల వెరిఫికేషన్ ఉంటుందని ట్విట్టర్ స్పష్టంగా పేర్కొంది, అయితే ఫాలోవర్లు ఎక్కువ ఖాతాలు కూడా వెరిఫికేషన్ అవుతాయని ట్విట్టర్ తెలిపింది.
undefined
ట్విట్టర్‌లో మీ అక్కౌంట్ వేరిఫై అవ్వాలంటే మీ ఖాతాకు స్పష్టమైన పేరు, ప్రొఫైల్ ఫోటో, మొబైల్ నంబర్ లేదా ఇమెయిల్ ఐడి ఉండాలి. అంతేకాకుండా మీ ఖాతా గత 6 నెలలుగా ఆక్టివ్ లో ఉంటే, మీరు మాత్రమే వెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
undefined
వెరిఫికేషన్ కోసం ఎలా దరఖాస్తు చేయాలి?ట్విట్టర్ వెరిఫికేషన్ ప్రక్రియ ప్రారంభమైన వెంటనే వినియోగదారుల ఖాతా సెట్టింగులలో వెరిఫికేషన్ అప్లికేషన్ కనిపిస్తుంది. వెరిఫికేషన్ టాబ్ వినియోగదారులందరి ఖాతాలలో కనిపిస్తుంది.
undefined
వెరిఫికేషన్ ట్యాబ్‌ను చూసిన తర్వాత మీరు పైన పేర్కొన్న 6 క్యాటగిరిలో దేనినైనా ఎంచుకోవాలి, ఆపై అఫిషియల్ ఐడి, ఇమెయిల్ ఐడి, వెబ్‌సైట్ లింక్ వంటి సమాచారాన్ని ట్విట్టర్‌కు ఇవ్వాలి. దరఖాస్తు చేసిన తరువాత, ట్విట్టర్ మీరు ఇచ్చిన సమాచారాన్ని తనిఖీ చేస్తుంది తరువాత మీ ఖాతాకి బ్లూ టిక్‌తో వెరిఫికేషన్ ఇస్తుంది.
undefined
click me!