సైబర్ మోసాల గురించి వినియోగదారులను ఈమెయిల్ ద్వారా హెచ్చరించాడు. సైబర్ దుండగులు ప్రజలకు ఫోన్ చేసి ఎయిర్‌టెల్ తరపున మాట్లాడుతున్నమంటూ చెప్పి మోసాలు చేస్తున్నారని గోపాల్ విట్టల్ చెప్పారు. ఈ సైబర్ దుండగులు డిజిటల్ పేమెంట్ వాడుతున్న వారినే ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారని ఆయన అన్నారు.
undefined
ఇంకా ఎయిర్‌టెల్ తరుపున మాట్లాడుతున్నట్లు చెప్పి ప్రజలను నో యువర్ కస్టమర్ (కెవైసి) ఫారమ్‌ను నింపమని అడుగుతున్నారు. ఇందుకు గూగుల్ ప్లే-స్టోర్ నుండి ఎయిర్‌టెల్ క్విక్ సపోర్ట్ అనే యాప్‌ను ఫోన్‌లో డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచిస్తున్నారు, అయితే ఇందులో నిజం ఏమిటంటే ఈ యాప్ ప్లే-స్టోర్‌లో లేదు.
undefined
ప్లే స్టోర్‌లో వినియోగదారులు ఈ యాప్ కనుగొనలేనప్పుడు దుండగులు టీమ్‌వ్యూయర్ క్విక్ సపోర్ట్ యాప్ డౌన్‌లోడ్ చేయమని అడుగుతారు. ఈ యాప్ ద్వారా సైబర్ దుండగులు ప్రజల ఫోన్‌లకు రిమోట్ యాక్సెస్ తీసుకొని వారి ఫోన్‌ల నుండి డేటాను దొంగిలించి అలాగే ఫోన్‌లో సేవ్ చేసిన పాస్‌వర్డ్‌లను కూడా కనుగొంటారు.
undefined
అలాగే ప్రజలకు వీఐపీ సభ్యత్వం ఇస్తామని హామీ ఇస్తూ వారిని ఒప్పిస్తారు. ఎయిర్‌టెల్ విఐపి మెంబర్‌షిప్ పేరుతో ఏ సర్వీస్ అందించడం లేదని, అలాగే ఫోన్‌లో థర్డ్ పార్టీ యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకోవాలని వినియోగదారులను కోరడం లేదని గోపాల్ విట్టల్ పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితిలో ఏదైనా మెసేజ్ లేదా ఫోన్ కాల్స్ తో జాగ్రత్తగా ఉండటం మంచిది. ఇలాంటి మోసాలకు ఎవరైనా గురైనట్లయితే వెంటనే 121కు ఫిర్యాదు చేయాలని కంపెనీ తెలిపింది.
undefined