వన్ ప్లస్ నార్డ్ 2 ప్యాక్-మ్యాన్ కొనుగోలుపై మూడు నెలలు స్పోటిఫై ( Spotify) ప్రీమియంను కూడా ఉచితంగా పొందవచ్చు. అయితే రెడ్ కేబుల్ క్లబ్ ప్లాట్‌ఫారమ్ ద్వారా ఈ ఆఫర్‌ను పొందవచ్చు. అయితే కొన్ని నిబంధనలు, షరతులు వర్తిస్తాయి.
వన్ ప్లస్ నార్డ్ 2 ప్యాక్-మ్యాన్ ఫీచర్లు
1.పెద్ద 4500mAh డ్యూయల్ సెల్ బ్యాటరీ, దీన్ని కేవలం 30 నిమిషాల్లో 0-100% వరకు ఛార్జ్ చేయవచ్చు.
2.90Hz ఫ్లూయిడ్ AMOLED డిస్‌ప్లే, డ్యూయల్ 5జి సిమ్ కార్డ్ స్లాట్‌లు, ఆక్సిజన్ ఓఎస్ 11.3 ప్రీ ఇన్‌స్టాల్ తో వస్తుంది
3.ఈ స్మార్ట్ ఫోన్ MediaTek డైమెన్సిటీ 1200-AI చిప్‌సెట్‌తో పని చేస్తుంది. లేటెస్ట్ కెమెరా ఫీచర్స్ తో పాటు వన్ ప్లస్ నార్డ్ 2 ప్యాక్-మ్యాన్ ఎడిషన్‌లోని MediaTek డైమెన్సిటీ 1200-AI చిప్‌సెట్ ఒరిజినల్ వన్ ప్లస్ నార్డ్ కంటే 65% వేగవంతమైన CPU పనితీరు, 125% మెరుగైన GPU పనితీరును అందిస్తుంది.