అమెజాన్ ప్రైమ్ వీడియో క్లిక్ షేరింగ్(clip sharing) సదుపాయాన్ని తీసుకొచ్చింది అంటే ఇప్పుడు మీరు అమెజాన్ ప్రైమ్ లో ఏదైనా సినిమా లేదా సిరీస్ చూస్తున్నప్పుడు ఏదైనా క్లిప్‌ను మీ స్నేహితులకు చూపించాలనుకుంటే వాట్సప్(whatsapp) లేదా మరేదైనా సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లో షేర్ చేయవచ్చు, అయితే మీరు గరిష్టంగా 30 సెకన్ల క్లిప్‌ను మాత్రమే షేర్ చేయగలరు.
అమెజాన్ ప్రైమ్ వీడియో యాప్‌లో క్లిప్ షేరింగ్ సదుపాయం ప్రస్తుతం కొన్ని ఎంచుకున్న సినిమాలు, సిరీస్‌లతో మాత్రమే పొందగలుగుతారు, అయితే భవిష్యత్తులో ఈ ఫీచర్ మరిన్ని టైటిల్స్ కి పెంచుతామని కంపెనీ చెప్పింది. క్లిప్ షేరింగ్ ఫీచర్ ప్రస్తుతం యూఎస్ లోని ఐఓఎస్ వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంది.
యూఎస్ వినియోగదారులు ఐఫోన్, ఐపాడ్ లో వీడియో షేరింగ్ ఆప్షన్ చూస్తారు. క్లిప్ షేర్ బటన్‌ను క్లిక్ చేసిన తర్వాత వీడియో పాజ్ అవుతుంది తరువాత 30 సెకన్ల క్లిప్ షేర్ చేయడానికి అందుబాటులో ఉంటుంది. దీని తర్వాత క్లిప్‌ను సవరించడానికి, షేర్ చేయడానికి కూడా ఒక ఆప్షన్ ఉంటుంది. షేర్ చేయడానికి ముందు ప్రివ్యూ ఆప్షన్ కూడా ఉంది.
కొద్ది రోజుల క్రితం అమెజాన్ ప్రైమ్ వీడియో మెంబర్‌షిప్ ధరను పెంచుతున్నట్లు ప్రకటించింది. పెంపు ప్రకటన తర్వాత అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ రూ.999 ప్యాక్ ధర రూ.1,499 అవుతుంది. దీని వాలిడిటీ 12 నెలలు. అలాగే రూ.329 త్రైమాసిక ప్లాన్ ధర రూ.459, రూ.129 నెల ప్లాన్ ధర రూ.179. అయితే పెంపు ఎప్పటినుంచి అనేది అమెజాన్ నిర్ణయించనప్పటికీ కొత్త ధర త్వరలో వర్తించనుంది. అమెజాన్ ప్రైమ్ ఐదేళ్ల క్రితం భారతదేశంలో ప్రవేశపెట్టిన సంగతి మీకు తెలిసిందే.