ఎయిర్‌టెల్ కస్టమర్లకు గుడ్ న్యూస్.. జియోకి పోటీగా ఇప్పుడు ఈ ప్లాన్‌తో ఎక్కువ డేటా..

First Published Nov 15, 2021, 7:28 PM IST

దేశీయ టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్(airtel) వినూత్న రీఛార్జ్ ప్యాకేజీతో వస్తుంది. సునీల్ మిట్టల్(sunil mittal) యాజమాన్యంలోని కంపెనీ ఇప్పుడు 500MB ఉచిత డైలీ డేటాను అందించడం ప్రారంభించింది. ఎయిర్‌టెల్ థాంక్స్(airtel thanks) గివింగ్ యాప్ ద్వారా వినియోగదారులు రోజుకు 0.5GB లేదా 500MB డేటాను రీడీమ్ చేసుకోవచ్చు. 

ఈ ప్రత్యేక ఆఫర్ ప్రీపెయిడ్ రీఛార్జ్(prepaid recharge) ప్లాన్‌లతో మాత్రమే వాలిడిటీ అవుతుందని గమనించాలి. అయితే ఈ ప్లాన్ కొత్తగా ప్రవేశపెట్టిన ప్లాన్ కాదు, కానీ  కొత్త ఇప్పటికే ఉన్న ప్లాన్‌కు కొత్త ప్రయోజనాలను జోడించింది. విశేషమేమిటంటే ఈ డేటా పూర్తిగా ఉచితంగా లభిస్తుంది. దీని కోసం వినియోగదారులు ప్రత్యేకంగా ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. 

 ఇప్పుడు రూ. 249 ప్రీపెయిడ్ ప్లాన్‌తో 500MB ఉచిత డేటా కూడా చేర్చింది. ఈ ప్లాన్ తో రోజుకు 1.5GB ఉచిత డేటాను అందిస్తుండగా ఇప్పుడు మొత్తం డేటా పరిమితి రోజుకు 2GBకి పెంచింది. అదనంగా ఈ  ప్లాన్ తో ఆన్ లిమిటెడ్ వాయిస్ కాలింగ్, ఎయిర్‌టెల్ థాంక్స్ బెనెఫిట్స్ తో పాటు రోజుకు 100 ఎస్‌ఎం‌ఎస్ లను అందిస్తుంది. రూ.249 ప్రీపెయిడ్ ప్లాన్ 28 రోజుల వాలిడిటీ ఉంటుంది, అయితే ఈ ప్లాన్ గతంలో రోజుకు 1.5GB డేటాను అందించింది, అంటే మొత్తం 42GB డేటా. ఈ ప్లాన్ వినియోగదారులు ఇప్పుడు 28 రోజుల వాలిడిటీలో రోజుకు 2GB డేటాను యాక్సెస్ చేయవచ్చు.  

ఎయిర్‌టెల్ థాంక్స్ గివింగ్ యాప్‌తో రీడీమ్ చేయగల ఇతర ప్రయోజనాలలో  ఒక నెల అమెజాన్ ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్ ట్రయల్, 1 సంవత్సరం షా అకాడమీ, అపోలో 24/7 సర్కిల్, ఉచిత హలో ట్యూన్ సబ్‌స్క్రిప్షన్‌లు, వింక్ మ్యూజిక్, ఫాస్టాగ్‌పై రూ. 100 క్యాష్‌బ్యాక్ లభిస్తుంది.

జియో కూడా ఈదే ధరతో ఒక ప్లాన్‌ కలిగి ఉంది, దినితో ఎయిర్‌టెల్  ప్లాన్ లాగానే బెనెఫిట్స్ అందుబాటులో ఉన్నాయి. వోడాఫోన్ ఐడియాలో కూడా రోజుకు 1.5 GB డేటాతో ప్లాన్‌  ఉంది, కానీ ఎయిర్‌టెల్  ప్రతిరోజూ 500gb అదనపు డేటాను ఇవ్వడం ద్వారా ఇతర టెలికాం నెట్ వర్క్ లను  వెనక్కి నెట్టివేసింది.

ఇప్పుడు 2 GB డేటా 
ఈ ఆఫర్‌తో ఎయిర్‌టెల్  ప్లాన్ ఇప్పుడు ప్రతిరోజు  2GB డేటాతో కూడిన ప్లాన్‌గా మారింది.  500MB డేటాను ఎయిర్‌టెల్  థాంక్స్ యాప్ ద్వారా రీడీమ్ చేసుకోవచ్చు. అమెజాన్ ప్రైమ్ వీడియో  మొబైల్ ఎడిషన్ కూడా ఈ ప్లాన్‌తో ఒక నెల పాటు అందుబాటులో ఉంటుంది. అంతేకాకుండా ఫాస్ట్‌ట్యాగ్‌లో రూ. 100 క్యాష్‌బ్యాక్‌తో పాటు అపోలో 24/7 సబ్‌స్క్రిప్షన్ కూడా అందుబాటులో ఉంది. ఉచిత హలో ట్యూన్ సబ్‌స్క్రిప్షన్‌లు, వింక్ మ్యూజిక్ లభిస్తుంది.

2021 సంవత్సరం రెండవ త్రైమాసిక ఫలితాల ప్రకారం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2021-22 జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో భారతీ ఎయిర్‌టెల్ నికర లాభం రూ. 1,134 కోట్లుగా ఉంది. అంతేకాకుండా,  4G కస్టమర్‌లు నిరంతరం పెరుగుతున్నారని, ఈ కారణంగా వ్యాపార కార్యకలాపాలు విజృంభిస్తున్నాయని కంపెనీ తెలిపింది.

ఏడాది క్రితం 2020-21 ఇదే త్రైమాసికంలో రూ. 763.2 కోట్ల నష్టాన్ని కలిగి ఉందని, ఈ ఏడాది లాభం మూడు రెట్లు పెరిగిందని ఎయిర్‌టెల్ ఒక ప్రకటనలో తెలిపింది. రెండో త్రైమాసికంలో ఎయిర్‌టెల్ ఏకీకృత ఆదాయం ఏడాది ప్రాతిపదికన 13 శాతం పెరిగి రూ.28,326.4 కోట్లకు చేరుకుంది. సెప్టెంబర్ త్రైమాసికంలో కంపెనీ మొత్తం మూలధన వ్యయం రూ.6,972 కోట్లుగా ఉంది.

click me!