50ఎం‌పి కెమెరాతో వన్‌ప్లస్ మరో పవర్ ఫుల్ 5జి స్మార్ట్‌ఫోన్‌... దీని వావ్ ఫీచర్స్ ఇవే..

First Published | Jul 23, 2021, 1:23 PM IST

చైనా కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ  వన్‌ప్లస్ కొత్త 5జి స్మార్ట్‌ఫోన్ వన్‌ప్లస్ నార్డ్ 2 5జిని భారతదేశంలో విడుదల చేసింది. ఈ సిరీస్ కింద మొదటి స్మార్ట్‌ఫోన్ వన్‌ప్లస్ నార్డ్ ని గత సంవత్సరంలో లాంచ్ చేసింది. 

మొదటి మోడల్‌లో నాలుగు వెనుక కెమెరాలు ఉండగా, కొత్త మోడల్ అంటే వన్‌ప్లస్ నార్డ్ 2 5జిలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ ఇచ్చారు. మీడియాటెక్ ప్రాసెసర్‌తో విడుదల చేసిన సంస్థ మొట్టమొదటి స్మార్ట్‌ఫోన్ వన్‌ప్లస్ నార్డ్ 2 5జి. ఈ ఫోన్‌తో పాటు కంపెనీ వన్‌ప్లస్ బడ్స్ ప్రోను కూడా విడుదల చేసింది.
undefined
వన్‌ప్లస్ నార్డ్ 2 5జి ప్రారంభ ధర రూ .27,999. ఈ ధర వద్ద 6 జీబీ ర్యామ్‌తో 128 జీబీ స్టోరేజ్ వేరియంట్‌ లభిస్తుంది. 8 జీబీ ర్యామ్‌తో 128 జీబీ స్టోరేజ్ వేరియంట్‌ ధర రూ .29,999. 256 జీబీ స్టోరేజ్‌తో 12 జీబీ ర్యామ్ ధర రూ .34,999. ఫోన్‌ను బ్లూ హెడ్జ్, గ్రే సెరా అండ్ గ్రీన్ వుడ్ కలర్‌లో కొనుగోలు చేయవచ్చు. వన్‌ప్లస్ నార్డ్ 2 5జిని అమెజాన్ ఇంకా కంపెనీ అఫిషియల్ వెబ్‌సైట్ నుండి జూలై 26 నుండి కొనుగోలు చేయవచ్చు. అయితే ఈ సేల్ వన్‌ప్లస్ రెడ్ మెంబర్స్, అమెజాన్ ప్రైమ్ యూజర్లకు ముందుగా ఉంటుంది, అయితే దీని ఓపెన్ సేల్ మాత్రం జూలై 28 నుండి ప్రారంభమవుతుంది.
undefined

Latest Videos


వన్‌ప్లస్ నార్డ్ 2 5జిలో ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఆక్సిజన్ ఓఎస్ 11.3 అందించారు. 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేటుతో 6.43-అంగుళాల పూర్తి హెచ్‌డి ప్లస్ ఫ్లూయిడ్ అమోలెడ్ డిస్‌ప్లే, మీడియాటెక్ హెలియో డైమెన్సిటీ 1200 ప్రాసెసర్, 12 జీబీ ఎల్‌పిడిడిఆర్4 ఎక్స్ ర్యామ్, 256 జిబి వరకు స్టోరేజ్ఆప్షన్ ఇచ్చారు.
undefined
ఈ వన్‌ప్లస్ ఫోన్‌లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది, దీని ప్రైమరీ లెన్స్ 50 మెగాపిక్సెల్ సోనీ IMX766 సెన్సార్ దీని ఎపర్చరు f1.88. దీనితో ఆప్టికల్ ఇమేజ్ స్టేబిలైజేషన్ సపోర్ట్ కూడా ఉంది. రెండవ లెన్స్ 8 మెగాపిక్సెల్స్ అల్ట్రా వైడ్, ఎపర్చరు f2.25 ఫీల్డ్ వ్యూ 119.7 డిగ్రీలు. దీనితో పాటు ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (EIS)ఉంటుంది. మూడవ లెన్స్ 2-మెగాపిక్సెల్ మోనోక్రోమ్ సెన్సార్. ఫోన్‌తో మీరు 4కె వీడియోలను 30fps వద్ద రికార్డ్ చేయవచ్చు. ముందు భాగంలో 32 మెగాపిక్సెల్ సెల్ఫి కెమెరా లభిస్తుంది, ఇది సోనీ IMX615 సెన్సార్.
undefined
వన్‌ప్లస్ నార్డ్ 2 5జిలో 256 జీబీ వరకు యుఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్ ఉంది. కనెక్టివిటీ కోసం దీనిలో 5జి, 4జి ఎల్‌టిఇ, వై-ఫై 6, బ్లూటూత్ వి5.2, జిపిఎస్ ఎ-జిపిఎస్, ఎన్‌ఎఫ్‌సి అండ్ యుఎస్‌బి టైప్-సి పోర్ట్, ఇన్ డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ ఉంది. ఫోన్‌లో డ్యూయల్ స్టీరియో స్పీకర్లు ఇచ్చార. వన్‌ప్లస్ నార్డ్ 2 5జిలో 4500 ఎంఏహెచ్ బ్యాటరీ, 65w ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్ ఇచ్చారు. ఫోన్‌తో పాటు బాక్స్‌లో ఛార్జర్ అందుబాటులో ఉంటుంది.
undefined
click me!