సామ్‌సంగ్ యూఏ32టీ4340ఏకేఎక్స్ఎక్స్ఎల్ (Samsung UA32T4340AKXXL LED Smart TV)
మంచి పిక్చర్ క్వాలిటీ, సౌండ్ నాణ్యతతో సామ్‌సంగ్ యూఏ32టీ4350ఏకేఎక్స్ఎక్స్ఎల్ టీవీ ఆకట్టుకుంటుంది. అలాగే విభిన్నమైన వర్చువల్ అసిస్టెంట్ల సపోర్టు, టీవీ కాస్టింగ్ సహా చాలా ఆప్షన్లు ఉన్నాయి. అయితే బ్లూటూత్ కనెక్టివిటీ లేకపోవడం దీనికి ప్రతికూలత.
ముఖ్యమైన స్పెసిఫికేషన్లు
స్క్రీన్ సైజ్: 32 ఇంచులు (రెజల్యూషన్ 1366x768 పిక్సెళ్లు హెచ్‌డీ రెడీ), 4కే హెచ్‌డీఆర్ సపోర్టు
20వాట్ల సౌండ్ ఔట్ పుట్, వైఫై. ప్రస్తుత ధర: రూ.17,990 (అమెజాన్)
ఎంఐ 4ఏ హారిజన్ ఎడిషన్ (Mi 4A Horizon Edition Smart LED TV)
రిచ్ కలర్లు, మంచి సౌండ్ క్వారిటీ, ఆండ్రాయిడ్ యాప్స్ ఇన్ స్టాల్ చేసుకునే సదుపాయాలతో ఉన్న ఎంఐ 4ఏ హారిజన్ ఎడిషన్ స్మార్ట్ టీవీ కూడా రూ.20లోపు మంచి ఆప్షన్ గా నిలుస్తుంది.
ముఖ్యమైన స్పెసిఫికేషన్లు
స్క్రీన్ సైజ్: 32 ఇంచులు (రెజల్యూషన్ 1366x768 పిక్సెళ్లు), 20 వాట్ల సౌండ్ ఔట్ పుట్ (డీటీఎస్ హెచ్‌డీ సౌండ్), బ్లూటూత్, వైఫై, ఆండ్రాయిడ్ టీవీ 9 ఆపరేటింగ్ సిస్టం. ప్రస్తుత ధర రూ.16,500 (అమెజాన్)
వన్‌ప్లస్ వై ఎల్ఈడీ స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ (OnePlus Y Smart LED TV)
అంచులు తక్కువగా ఉండడం, మంచి పిక్చర్ క్వాలిటీ ఈ వన్‌ప్లస్ వై ఎల్ఈడీ స్మార్ట్ టీవీ సానుకూల అంశాలు. గామా ఇంజిన్ ఉండడంతో వీడియా కంటెంట్ చాలా బాగా కనిపిస్తోంది. అలాగే 91.4శాతం స్క్రీన్ బాడీ రేషియోతో చూసేందుకు ఆకర్షించే విధంగా ఉంటుంది.
ముఖ్యమైన స్పెసిఫికేషన్లు
స్క్రీన్ సైజ్: 32 ఇంచులు (రెజల్యూషన్ 1366x768 పిక్సెళ్లు హెచ్‌డీ రెడీ), 20 వాట్ల సౌండ్ ఔట్ పుట్ (డాల్బీ ఆడియో), బ్లూటూత్, వైఫై, ఆండ్రాయిడ్ టీవీ 9 ఆపరేటింగ్ సిస్టం. ప్రస్తుత ధర రూ.16,999 (అమెజాన్).
ఐఫాల్కాన్ 40ఎఫ్2ఏ (IFFALCON 40F2A)
రూ.20వేలలోపు 40 ఇంచుల 4కే హెచ్‌డీఆర్ స్క్రీన్ తో స్మార్ట్ టీవీ కావాలనుకునే వారికి ఐఫాల్కాన్ 40ఎఫ్2ఏ బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. ఫుల్ హెచ్‌డీ రెజల్యూషన్, మంచి సౌండ్ క్వాలిటీ కూడా ఈ టీవీలో ఉన్నాయి.
ముఖ్యమైన స్పెసిఫికేషన్లు
స్క్రీన్ సైజ్: 40 ఇంచులు (రెజల్యూషన్ 1920x1080 పిక్సెళ్లు, హెచ్‌డీ రెడీ), 20 వాట్ల సౌండ్ ఔట్ పుట్, బ్లూటూత్, వైఫై, ఆండ్రాయిడ్ టీవీ 8 ఆపరేటింగ్ సిస్టం. ప్రస్తుత ధర రూ.19,999 (ఫ్లిప్‌కార్ట్).
నోకియా హెచ్‌డీ రెడీ ఎల్ఈడీ స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ (Nokia HD Ready LED Smart TV)
39 వాట్ల స్పీకర్లతో అదిరిపోయే సౌండ్ క్వాలిటీ ఇస్తుంది ఈ నోకియా స్మార్ట్ టీవీ. ఒంకోయో స్పీకర్లు ఈ టీవీకి ప్రధాన ఆకర్షణ. అలాగే పిక్చర్ క్వాలిటీ సైతం ఆకట్టుకునేలా ఉంటుంది. 4కే హెచ్‌డీఆర్ సపోర్టు కూడా ఉంది.
ముఖ్యమైన స్పెసిఫికేషన్లు
స్క్రీన్ సైజ్: 32 ఇంచులు (రెజల్యూషన్ 1366x786 పిక్సెళ్లు, హెచ్‌డీ రెడీ), 39 వాట్ల సౌండ్ ఔట్ పుట్, వైఫై, ఆండ్రాయిడ్ టీవీ ఆపరేటింగ్ సిస్టం. ప్రస్తుత ధర రూ.16,499 (ఫ్లిప్‌కార్ట్).