గత సంవత్సరం గూగుల్ అన్యువల్ గూగుల్ ఫర్ ఇండియా ఈవెంట్ సందర్భంగా, భారతదేశంలోని వ్యాపారులు ఇంకా వినియోగదారులకు చిన్న రుణాలను అందిస్తామని కంపెనీ ప్రకటించింది. దీనిని Gpayని ఉపయోగించి రీడీమ్ చేసుకోవచ్చని తెలిపింది.
భారతదేశంలోని అతిపెద్ద ఆన్‌లైన్ చెల్లింపు సర్వీస్ ప్రొవైడర్‌లలో ఒకటైన Google Pay, బ్యాంకులు అండ్ నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సంస్థల (NBFCలు)తో చేతులు కలపడం ద్వారా భారతదేశంలోని వినియోగదారులు అలాగే వ్యాపారుల కోసం క్రెడిట్-ఆధారిత ప్రొడక్ట్స్ శ్రేణిని విడుదల చేయనున్నట్లు తెలిపింది.
ఇందుకు రుణ సేవలను అందించడానికి టెక్నాలజీ దిగ్గజం DMI ఫైనాన్స్‌తో భాగస్వామ్యం చేసుకుంది. రూ.10,000 నుండి 1 లక్ష వరకు చిన్న సాచెట్ లోన్‌లు తిరిగి చెల్లింపు వ్యవధి 7 రోజుల నుండి 12 నెలల వరకు ఉంటుంది.
ఇవి రూ. 15,000 నుండి ప్రారంభ ధర రూ. 111 నుండి ప్రారంభమయ్యే EMIలలో తిరిగి చెల్లించబడుతుంది. ఇందుకు రుణ సేవలను అందించడానికి టెక్నాలజీ దిగ్గజం DMI ఫైనాన్స్‌తో భాగస్వామ్యం ఉంది. ఇప్పుడు వ్యాపారవేత్తలకే కాదు, ప్రజలు కూడా క్రెడిట్ పొందడం ప్రారంభించవచ్చు.
Google Payలో క్రెడిట్ లోన్ అప్షన్ ఎంచుకోవడం ద్వారా మీరు రూ.20,000 వరకు లోన్ తీసుకోవచ్చు. అయితే ఇప్పుడు స్టేట్ బ్యాంక్, ICICI బ్యాంక్‌లకు మాత్రమే ఈ ఫెసిలిటీ అందుబాటులో ఉంది. ఇంకా అర్హులైన వారికే అందుబాటులో ఉంటుందని చెప్పారు.