ఒకదాన్ని మించి మరొకటి.. కొద్దిరోజుల్లో నథింగ్ ఫోన్ 2ఎ స్పెషల్ ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే ?

Published : May 31, 2024, 01:05 PM IST

నథింగ్ ఫోన్ (2a) స్పెషల్ ఎడిషన్ జూన్ 5న ఇండియాలో లాంచ్ కానుంది. అయితే దీనికి సంబంధించిన ఫుల్  ఫీచర్స్, ధర ఎంతో  తెలుసుకోండి...  

PREV
15
ఒకదాన్ని మించి మరొకటి.. కొద్దిరోజుల్లో నథింగ్ ఫోన్ 2ఎ స్పెషల్ ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే ?

స్మార్ట్‌ఫోన్‌లకు ప్రసిద్ధి చెందిన లండన్‌ ఫోన్ తయారీ సంస్థ తాజాగా నథింగ్ ఫోన్ (2ఎ) ప్రత్యేక ఎడిషన్‌ను లాంచ్  చేసింది. నథింగ్ ఫోన్ 2ఎ స్పెషల్ ఎడిషన్ జూన్ 5 నుండి ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా అందుబాటులోకి రానుంది.  అయితే స్పెషల్ ఎడిషన్ కాబట్టి  కొన్ని ఫోన్స్  మాత్రమే  అందుబాటులో ఉంటాయని తెలిపింది. 
 

25

మంచి కలర్స్ (నీలం, పసుపు ఇంకా ఎరుపు)తో  మొట్టమొదటి ఫోన్ ఇదేనని కంపెనీ పేర్కొంది. నథింగ్ బ్రాండెడ్ వైర్‌లెస్ ఇయర్‌బడ్స్  పై రెడ్  కలర్ ఉపయోగించగా, కొత్త ఇయర్ (ఎ)లో పసుపు రంగును ఉపయోగించారు.  

35

స్పెషల్  లిమిటెడ్ ఎడిషన్ ఫోన్  ఫస్ట్  లుక్ లో వైట్ కలర్  నథింగ్ ఫోన్ (2a) లాగా కనిపించవచ్చు. మీరు దగ్గరగా చూస్తే, కెమెరా చుట్టూ బ్లూ రింగ్‌తో కొన్ని పసుపు, నీలం అండ్ ఎరుపు భాగాలు ఉన్నట్లు   చూడవచ్చు. నథింగ్ ఫోన్ (2a) MediaTek Dimensity 7200 Pro చిప్‌సెట్ తో వస్తుంది.
 

45

 6.7-అంగుళాల FullHD+ 120Hz AMOLED స్క్రీన్‌, ఇతర నథింగ్ ఫోన్స్ లాగే  నథింగ్ ఫోన్ (2a) ట్రాన్సపరెంట్ బ్యాక్ ప్యానెల్, 50MP ప్రైమరీ సెన్సార్, 50MP అల్ట్రావైడ్ లెన్స్‌తో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ ఉంది.  ఆండ్రాయిడ్ 14 ఆధారంగా NothingOSలో రన్ అవుతుంది.
 

55

దీనిలో ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇచ్చే 5,000mAh బ్యాటరీ  ఉంది. ఇంకా 12GB RAM, 256GB స్టోరేజ్‌తో వస్తుంది. జూన్ 5 నుండి ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా రూ.27,999 ధరతో అందుబాటులో ఉంటుంది. కస్టమర్లు బ్యాంక్ కార్డులతో ఇన్స్టంట్  రూ.1,000 డిస్కౌంట్ పొందవచ్చు. దీంతో దీని ధర రూ.26,999కి తగ్గనుంది.
 

click me!

Recommended Stories