తక్కువ ధరకే మెగా జాక్‌పాట్.. రూ.8వేలలోపు బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ ఇవే..

First Published | May 29, 2024, 2:44 PM IST

స్మార్ట్ ఫోన్ కొనాలని చూస్తున్నారా.. అయితే మీ బడ్జెట్ 10వేలలోపు ఉంటే ఈ ఫోన్స్ పై ఓ లుక్కేయండి. బేసిక్ అవసరాలకు ఈ ఫోన్స్ సరిగ్గా సరిపోతుంది. ఇండియాలో రూ. 8వేలలోపు బెస్ట్ ఫోన్‌లు, వాటి ప్రత్యేక ఫీచర్లు, ధరలు మొదలైన వాటి గురించి మీకోసం.. 
 

Poco M5 బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో అత్యంత స్టైలిష్ డిజైన్‌లలో ఒకటి. దీని ప్రైమరీ కెమెరా మంచి అనుభవాన్ని అందిస్తుంది. దీని బ్యాటరీ లైఫ్  కూడా అద్భుతమైనది. దీనిలో మంచి ప్రాసెసర్, గొప్ప డిస్ కూడా  ఉంది. రూ.8 వేల లోపు బెస్ట్ స్మార్ట్‌ఫోన్ ఇదే.
 

Motorola Moto G04 6.5-అంగుళాల HD+ డిస్‌ప్లే, Unisoc T606 ఆక్టా-కోర్ ప్రాసెసర్, 8GB ర్యామ్ ద్వారా  మంచి  పర్ఫార్మెన్స్ తో  ఆకట్టుకుంటుంది. 128GB ఇంటర్నల్  స్టోరేజ్ 1TB వరకు పెంచుకోవచ్చు. 5,000mAh బ్యాటరీ రోజంతా వస్తుంది. మొత్తంమీద, Moto G04 బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో గొప్ప  వాల్యూ అందిస్తుంది.
 


Redmi 13C మీరు రూ.8,000లోపు కొనుగోలు చేయగల అత్యంత బెస్ట్ ఫోన్‌లలో ఒకటి. ఈ ఫోన్ MediaTek Helio G85 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. మీరు మల్టీ టాస్కింగ్ కోసం 4/6/8 GB LPDDR4X RAM అప్షన్  కూడా ఉంది. ఈ ఫోన్  హైలెట్స్  లో ఒకటి దాని 90Hz రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లే. 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా కూడా ఉంది.
 

ఐడల్ ఎస్23 మంచి బడ్జెట్ స్మార్ట్‌ఫోన్. ఫోన్ 90Hz డిస్‌ప్లేతో వస్తుంది. ఇంకా పెద్ద 5,000 mAh బ్యాటరీ ఉంది. Unisoc T616 ప్రాసెసర్‌తో   పనిచేస్తుంది. కానీ ప్రాథమిక కెమెరా సెటప్, డేటెడ్ ఆండ్రాయిడ్ 12 OS అవుట్ ఆఫ్ ది బాక్స్, 10W ఛార్జింగ్ మైనస్ పాయింట్లు.
 

Samsung Galaxy M04 MediaTek Helio P35 SoC ద్వారా రన్ అవుతుంది. 6.5-అంగుళాల HD+ LCD డిస్‌ప్లే, యాప్స్ వాడటానికి   తగినంత పవర్ స్మార్ట్‌ఫోన్‌కు అందిస్తుంది.  ఫోన్ ఆండ్రాయిడ్ 12 అవుట్ ఆఫ్ ది బాక్స్‌తో వస్తుంది, సామ్‌సంగ్ బడ్జెట్ సెగ్మెంట్‌లో నాలుగేళ్ల సెక్యూరిటీ అప్‌డేట్‌లు ఇంకా  రెండు OS అప్‌డేట్‌లతో వస్తుంది.
 

Latest Videos

click me!