అమెజాన్ కి పోటీగా నెట్‌ఫ్లిక్స్ న్యూ ఇయర్ గిఫ్ట్.. ఇప్పుడు సబ్ స్క్రిప్షన్ ప్లాన్‌లపై భారీగా తగ్గింపు..

First Published | Dec 14, 2021, 11:54 AM IST

అమెరికన్ స్ట్రిమింగ్ సర్వీస్ అండ్ ప్రొడక్షన్ కంపెనీ నెట్‌ఫ్లిక్స్(netflix)  కొత్త సంవత్సరానికి ముందు కస్టమర్లకు అదిరిపోయే గిఫ్ట్ అందించింది. అదేంటంటే నెట్‌ఫ్లిక్స్ ప్లాన్‌లు ఇప్పుడు 60 శాతం వరకు చౌకగా మారాయి. కొత్త ప్లాన్ ధరలు ఈరోజు అంటే డిసెంబర్ 14 నుండి వర్తిస్తాయి. 

నెట్‌ఫ్లిక్స్   Netflix ఈ ప్రకటన తర్వాత మీరు ప్రతి ప్లాన్‌పై 18 శాతం నుండి 60 శాతం వరకు డబ్బు ఆదా చేసుకోవచ్చు. ఈ అప్‌డేట్ తర్వాత నెట్‌ఫ్లిక్స్ మొబైల్ ప్లాన్ ప్రారంభ ధర రూ.149కి చేరింది, అంటే అంతకుముందు రూ.199గా ఉండేది.

నెట్‌ఫ్లిక్స్  కొత్త ప్లాన్
నెట్‌ఫ్లిక్స్  మొబైల్ ప్లాన్ ధర ఇప్పుడు అత్యంత చౌకగా రూ.149కి కొనుగోలు చేయవచ్చు. అంతేకాకుండా బేసిక్ ప్లాన్ ధర గతంలో రూ.499 నుండి రూ.199కి చేరింది. ఈ ప్లాన్‌పై గరిష్ట తగ్గింపు చేసింది. నెట్‌ఫ్లిక్స్ స్టాండర్డ్ ప్లాన్ ఇప్పుడు రూ. 499, గతంలో రూ.649గా ఉండేది. అలాగే నెట్‌ఫ్లిక్స్ ప్రీమియం ప్లాన్‌ను ఇప్పుడు రూ.649కి తీసుకోవచ్చు, అంతకుముందు రూ.799గా ఉండేది.

Latest Videos


నెట్‌ఫ్లిక్స్  ప్లాన్‌లో ఏం అందుబాటులో ఉంటుంది?
నెట్‌ఫ్లిక్స్ మొబైల్ ప్లాన్‌లో స్టాండర్డ్ డెఫినిషన్ (SD) 480 పిక్సెల్ రిజల్యూషన్‌లో కంటెంట్‌లు అందుబాటులో ఉంటాయి. హెచ్‌డి అంటే 1080 పిక్సెల్‌ల కంటెంట్ ప్రామాణిక ప్లాన్‌లో అందుబాటులో ఉంటుంది. నెట్‌ఫ్లిక్స్ Premiumలో కస్టమర్‌లు 4K రిజల్యూషన్ అండ్ HDRలో కంటెంట్‌ను పొందుతారు.

అమెజాన్ ప్రైమ్  వీడియో
నెట్‌ఫ్లిక్స్ కొత్త ప్లాన్లు ఓ‌టి‌టి ఫ్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ వీడియో సబ్‌స్క్రిప్షన్‌తో పోటీపడుతుంది. త్వరలోనే  అమెజాన్ ప్రైమ్  వార్షిక ప్లాన్ ధర రూ. 999 నుండి రూ. 1,499గా మారనుంది. అంతే కాకుండా, ప్రతి నెల ప్లాన్ ధర రూ.125 పెరిగింది, అయితే కొన్ని టెలికాం కంపెనీల రిచార్జ్ ప్లాన్‌లతో Amazon Prime వీడియో మొబైల్ ఎడిషన్‌ను కూడా రూ.89కు తీసుకోవచ్చు.

click me!