ఈ సంవత్సరం గూగుల్ లో ట్రెండింగ్ పర్సన్స్
టోక్యో ఒలింపిక్స్‌లో జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ఈ సంవత్సరం గూగుల్‌లో అత్యంత ట్రెండింగ్ వ్యక్తులలో ఒకరుగా ఉన్నారు. బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్, టెస్లా వ్యవస్థాపకుడు ఎలోన్ మస్క్ అండ్ విక్కీ కౌశల్, షెహనాజ్ గిల్ అలాగే రాజ్ కుంద్రాతో సహా కొందరు ప్రముఖులు 2021లో గూగుల్‌లో టాప్ ట్రెండింగ్ వ్యక్తులలో ఉన్నారు.
ఈ సంవత్సరం గూగుల్ లో ట్రెండింగ్ సినిమాలు
తమిళ సినిమా జై భీమ్ టాప్ ట్రెండింగ్ సినిమాల జాబితాలో అగ్రస్థానంలో ఉంది. అలాగే ఈ సంవత్సరం భారతదేశంలో గూగుల్ వినియోగదారుల ఆసక్తిని ఆకర్షించడంలో ఈ ప్రాంతీయ సినిమా విజయం సాధించింది. ఆ తర్వాత బాలీవుడ్ చిత్రాలు షేర్షా, రాధే, బెల్ బాటమ్ ఉన్నాయి. గాడ్జిల్లా వర్సెస్ కాంగ్, ఎటర్నల్స్‌తో సహా కొన్ని హాలీవుడ్ సినిమాలు దేశంలో ఈ సంవత్సరం టాప్ ట్రెండింగ్ సినిమాలలో ఉన్నాయి.
గూగుల్ లో ట్రెండింగ్ రెసిపీలు !
కరోనా కాలం ప్రారంభమైన తొలి నెలల్లో ప్రజలు ఎక్కువగా ఇళ్లలోనే ఉంటున్నందున వంటకాలను చేయడానికి చాలా మంది గూగుల్ ని ఉపయోగించారని నివేదిక చూపుతోంది. ఈ సంవత్సరం భారతదేశంలో గూగుల్ లో టాప్ ట్రెండింగ్ రెసిపీలు 'ఎనోకి మష్రూమ్స్', 'మోదక్', 'కుకీలు' ముఖ్యంగా ఉన్నాయి. ఈ సంవత్సరం సెర్చ్ చేసిన టాప్ వంటకాలు 'మేతి మీటర్ మలై' మరియు 'పాలక్', 'కడ' అని గూగుల్ తెలిపింది. ఈ వంటకాలు రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది.
గూగుల్ లో ట్రెండింగ్ స్పోర్ట్ ఈవెంట్‌లు
టాప్ ట్రెండ్ లాగానే గూగుల్ ఇండియన్ ప్రీమియర్ లీగ్, ఐసిసి టి20 వరల్డ్ కప్, యూరో కప్‌లను భారతదేశంలో సెర్చ్ చేసిన మూడు టాప్ స్పొర్ట్స్ అని పేర్కొంది. వీటి తర్వాత టోక్యో ఒలింపిక్స్, కోపా అమెరికా ఉన్నాయి.