జియో ఫోన్ నెక్స్ట్ కి పోటీగా శామ్‌సంగ్.. దేనిలో బ్బెస్ట్ ఫీచర్స్ ఉన్నాయంటే ?

First Published | Dec 7, 2021, 4:16 PM IST

శాంసంగ్ దీపావళి(diwali) 2021 సందర్భంగా భారతీయ మార్కెట్లో జియో ఫోన్ నెక్స్ట్‌(jiophone next)ను ప్రవేశపెట్టింది. జియో అండ్ గూగుల్(google) భాగస్వామ్యంతో వస్తున్న ఈ ఫోన్ ధర రూ. 6,499, కానీ మీరు దీన్ని ప్రతి నెల ఈ‌ఎం‌ఐతో రూ. 305.93 వద్ద కూడా కొనుగోలు చేయవచ్చు. 

మీరు ఈ‌ఎం‌ఐలో ఫోన్‌ను కొనుగోలు చేస్తే రీఛార్జ్ చేయవలసిన అవసరం లేదు, ఎందుకంటే రీఛార్జ్ ప్లాన్ ఈ‌ఎం‌ఐ మొత్తంలో  కలిపి ఉంటుంది. తాజాగా శామ్‌సంగ్ ఇండియా  కొత్త స్మార్ట్‌ఫోన్ శామ్‌సంగ్ గెలాక్సీ ఏ03 కోర్‌ని భారతీయ మార్కెట్లో విడుదల చేసింది, అయితే ఈ ఫోన్ జియో ఫోన్ నెక్స్ట్‌కి పోటీగా తీసుకొచ్చారు. గెలాక్సీ  ఏ03 కోర్ ధర రూ. 7,999 మరోవైపు జియో ఫోన్ నెక్స్ట్ ధర రూ. 6,499. ఈ రెండు ఫోన్‌ల ధరలో రూ.1,500 తేడా ఉంది. అయితే మీరు ఏ ఫోన్ కొనుగోలు చేయాలో ఏ ఫోన్ బెస్ట్ డీల్ అవుతుందో చూద్దాం..
 

జియో ఫోన్ నెక్స్ట్ vs శామ్‌సంగ్ గెలాక్సీ ఏ03 కోర్: స్పెసిఫికేషన్‌లు

శామ్‌సంగ్ గెలాక్సీ ఏ03 కోర్ HD+ రిజల్యూషన్‌తో 6.5-అంగుళాల ఇన్ఫినిటీ  V డిస్‌ప్లే, Unisoc SC9863A ప్రాసెసర్, 2జి‌బి ర్యామ్, 32జి‌బి స్టోరేజ్‌ని పొందుతుంది, అలాగే 1టి‌బి వరకు స్టోరేజ్ విస్తరించుకోవచ్చు. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ గో ఎడిషన్‌తో పరిచయం చేసింది.

జియో ఫోన్ నెక్స్ట్ ఫోన్ గొరిల్లా గ్లాస్ 3 రక్షణతో 5.45-అంగుళాల HD+ డిస్‌ప్లే, Qualcomm Quadcore QM 215 ప్రాసెసర్, 2 జి‌బి ర్యామ్ తో 32జి‌బి స్టోరేజ్ ఉంది, మెమరీ కార్డ్ సహాయంతో 512జి‌బి వరకు పెంచుకొవచ్చు.

Latest Videos


 జియో ఫోన్ నెక్స్ట్ vs శామ్‌సంగ్ గెలాక్సీ ఏ03 కోర్: కెమెరా

గెలాక్సీ ఏ03 కోర్ కోసం సింగిల్ బ్యాక్ అండ్  ఫ్రంట్ కెమెరా ఉంది. గెలాక్సీ ఏ03 కోర్ f/2.0 ఎపర్చర్‌తో 8-మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా లభిస్తుంది. ముందువైపు 5 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. బ్యాక్ కెమెరాతో ఫ్లాష్ లైట్ అందించారు. 

 జియో ఫోన్ నెక్స్ట్ ఫోన్‌లో 13 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా అండ్ 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. ఫోన్‌లో డ్యూయల్ సిమ్ సపోర్ట్ ఉంది, దీనిలో నానో సిమ్ సపోర్ట్ అందించారు.

జియో ఫోన్ నెక్స్ట్ vs శామ్‌సంగ్ గెలాక్సీ ఏ03 కోర్: బ్యాటరీ

ఈ శామ్‌సంగ్ ఫోన్ లో 5000mAh బ్యాటరీ ఉంది. ఫోన్‌లో ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండదు. కనెక్టివిటీ కోసం 4జి ఎల్‌టి‌ఈ, సింగిల్ బ్యాండ్ Wi-Fi 802.11 b/g/n, Wi-Fi డైరెక్ట్, బ్లూటూత్ v4.2, 3.5mm హెడ్‌ఫోన్ జాక్, జి‌పి‌ఎస్, ఛార్జింగ్ పోర్ట్ అండ్ GLONASS ఉన్నాయి.

జియో ఫోన్ నెక్స్ట్ లో 3500mAh బ్యాటరీ  లభిస్తుంది. కనెక్టివిటీ కోసం వై-ఫై, బ్లూటూత్ వంటి ఆప్షన్లు ఉన్నాయి. హాట్‌స్పాట్ సౌకర్యం కూడా కల్పించారు. మొదటి సిమ్ ఇంటర్నెట్ కోసం ఉపయోగించబడుతుంది. రెండవ సిమ్ కాల్స్ చేయడానికి మాత్రమే ఉపయోగించబడుతుంది. సామ్‌సంగ్ ఫోన్‌లలో అలాంటివి లేదు.

click me!