Motorola Edge 70 Neo: ఛార్జింగ్ టెన్షన్‌కు గుడ్‌బై.. 53 గంటల బ్యాకప్ ఇచ్చే కొత్త మోటరోలా ఫోన్

Published : Nov 22, 2026, 07:05 AM IST

Motorola Edge 70 Neo: మోటరోలా ఎడ్జ్ 70 నియో నవంబర్ 24న భారత్‌లో లాంచ్ కానుంది. 7,000mAh బ్యాటరీ, 144Hz అమోలెడ్ డిస్‌ప్లే, స్నాప్ డ్రాగన్ 7ఎస్ జెన్ 3 చిప్‌సెట్‌తో వస్తున్న ఈ ఫోన్ పూర్తి వివరాలు మీకోసం.

PREV
16
గేమర్స్‌కు పండగే.. బైపాస్ ఛార్జింగ్, కూలింగ్ టెక్నాలజీతో మోటరోలా కొత్త ఫోన్

స్మార్ట్‌ఫోన్ ప్రియులకు మోటరోలా గుడ్ న్యూస్ చెప్పింది. లెనోవో యాజమాన్యంలోని ఈ బ్రాండ్ తన కొత్త మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్ మోటరోలా ఎడ్జ్ 70 నియో (Motorola Edge 70 Neo)ను నవంబర్ 24న భారత్‌లో లాంచ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది.

ఫ్లిప్‌కార్ట్ మైక్రోసైట్ ద్వారా విడుదల తేదీతో పాటు కీలక హార్డ్‌వేర్ వివరాలను కంపెనీ కన్ఫర్మ్ చేసింది. సోషల్ రెడీ. ఆల్రెడీ.. యువర్ సోషల్ రెడీ ఎరా ఈజ్ కాలింగ్ అనే ట్యాగ్‌లైన్స్‌తో ఈ ఫోన్‌ను ప్రమోట్ చేస్తోంది. ఇప్పటివరకు నియో సిరీస్ అంటే చిన్న సైజు ఫోన్లుగా ఉండేవి. కానీ ఈసారి ఆ పాత ఫార్ములాను పక్కనపెట్టి, బిగ్ స్క్రీన్, జంబో బ్యాటరీతో మల్టీమీడియా యూజర్లను టార్గెట్ చేస్తోంది.

26
డిజైన్, పాంటోన్ ఫినిష్‌లు

మోటరోలా ఎడ్జ్ 70 నియో కేవలం 8.49mm మందం, 204 గ్రాముల బరువుతో ఆకర్షణీయంగా ఉండనుంది. ఫోన్ వెనుక భాగంలో మూడు వృత్తాకార కెమెరా కటౌట్లు, ప్రత్యేక ఎల్ఈడీ ఫ్లాష్‌తో కూడిన స్క్వేర్ కెమెరా ఐలాండ్ ఉంది. మధ్యలో మోటరోలా లోగో ఉంటుంది. ఈ ఫోన్ నాలుగు ప్రత్యేక పాంటోన్ రంగులు, విభిన్న టెక్స్చర్ ఫినిష్‌లతో వస్తోంది..

• పాంటోన్ గ్రే లైలాక్: అసిటేట్ ఫినిష్‌తో లేత గులాబీ రంగు.

• పాంటోన్ మిల్కీ బ్లూ: లెదర్ తరహా ఫినిష్‌తో లేత నీలం రంగు.

• పాంటోన్ మౌంటెన్ వ్యూ: సిల్క్ తరహా ఫినిష్‌తో ముదురు ఆకుపచ్చ రంగు.

• పాంటోన్ సేజ్: లెదర్ తరహా ఫినిష్‌తో లేత ఆకుపచ్చ రంగు.

36
బ్రైట్ డిస్‌ప్లే, గేమింగ్ ప్రాసెసర్

ఈ ఫోన్‌లో 6.8 అంగుళాల ఎక్స్‌ట్రీమ్ అమోలెడ్ కర్వ్‌డ్ డిస్‌ప్లేను ఇచ్చారు. ఇది 2772 x 1272 పిక్సెల్స్ (1.5K) రిజల్యూషన్, 144Hz రిఫ్రెష్ రేట్, 5,200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను సపోర్ట్ చేస్తుంది. స్క్రీన్ ప్రొటక్షన్ కోసం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ఉంది. ఇక పనితీరు విషయానికొస్తే, ఇందులో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7s Gen 3 ప్రాసెసర్‌ను ఉపయోగించారు.

నథింగ్ ఫోన్ (3a), రెడ్‌మీ నోట్ 14 ప్రో+ ఫోన్లలో కూడా ఇదే చిప్‌సెట్ ఉంది. గేమింగ్ ఆడేటప్పుడు ఫోన్ వేడెక్కకుండా ఉండేందుకు 4,466 చదరపు మిల్లీమీటర్ల వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్‌ను అందించారు. అలాగే 8GB LPDDR5X ర్యామ్ వుండగా, ర్యామ్ బూస్ట్ ద్వారా 24GB వరకు పెంచుకోవచ్చు, 128GB UFS 3.1 స్టోరేజ్ ఉన్నాయి. మైక్రో ఎస్‌డీ కార్డ్ ద్వారా స్టోరేజ్ పెంచుకునే సదుపాయం కూడా ఉంది.

46
కెమెరా సెటప్, సాఫ్ట్‌వేర్ వివరాలు

ఫోటోగ్రఫీ కోసం వెనుకవైపు 50MP సోనీ లైటియా 710 మెయిన్ కెమెరా OIS సపోర్ట్‌తో, 2MP మాక్రో విజన్ లెన్స్, 3 ఇన్ 1 లైట్ సెన్సార్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 32MP క్వాడ్ పిక్సెల్ కెమెరా ఇచ్చారు. సాఫ్ట్‌వేర్ పరంగా ఇది లేటెస్ట్ ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది. అధికారిక స్పెక్ షీట్ ప్రకారం దీనికి 3 మేజర్ ఓఎస్ అప్‌డేట్లు, 5 ఏళ్ల సెక్యూరిటీ ప్యాచ్‌లు లభిస్తాయి. అలాగే, ఐపీ 64 రేటింగ్ ఉంది.

56
7,000mAh భారీ బ్యాటరీ.. 53 గంటల పవర్ బ్యాకప్

ఈ స్మార్ట్‌ఫోన్‌కు ప్రధాన ఆకర్షణ దీని బ్యాటరీ. ఇందులో ఏకంగా 7,000mAh సామర్థ్యం గల బ్యాటరీని అమర్చారు. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 53 గంటల వరకు బ్యాకప్ ఇస్తుందని మోటరోలా పేర్కొంది. బాక్స్‌లోనే 45W టర్బోపవర్ ఛార్జర్ వస్తుంది. అంతేకాకుండా 7.5W రివర్స్ వైర్డ్ ఛార్జింగ్, గేమర్స్ కోసం బ్యాటరీ దెబ్బతినకుండా ఉండే బైపాస్ ఛార్జింగ్ ఫీచర్ కూడా ఇందులో ఉంది.

66
మోటరోలా ఎడ్జ్ 70 నియో ధర ఎంత?

గతంలో 2025 సెప్టెంబర్‌లో గ్లోబల్‌గా వచ్చిన ఎడ్జ్ 60 నియో 6.36 అంగుళాల చిన్న స్క్రీన్, 5,200mAh బ్యాటరీ, 68W ఛార్జింగ్, 3x టెలిఫోటో కెమెరాతో వచ్చింది. కానీ కొత్త ఎడ్జ్ 70 నియోలో అల్ట్రావైడ్ లేదా టెలిఫోటో లెన్స్‌లను తీసేసి, కేవలం 50MP మెయిన్ కెమెరాను అందిస్తున్నారు.

ప్రస్తుతం ఇండియాలో ఎడ్జ్ 70 సిరీస్‌లో భాగంగా ఎడ్జ్ 70, ఎడ్జ్ 70 ఫ్యూజన్, ఎడ్జ్ 70 ప్రో, ఎడ్జ్ 70 ప్రో ప్లస్, ఎడ్జ్ 70 మ్యాక్స్ మోడళ్లు ఉన్నాయి. ఎడ్జ్ 70 ఫ్యూజన్ లో కొత్త చిప్‌సెట్, 68W ఛార్జింగ్ ఉన్నాయి. కాబట్టి ఎడ్జ్ 70 నియో ధర రూ. 25,000 నుండి రూ. 28,000 మధ్య ఉండవచ్చని కొన్ని టెక్ వర్గాలు అంచనా వేస్తుండగా, ర్యామ్ ధరల పెరుగుదల కారణంగా రూ. 35,000 నుండి రూ. 40,000 మధ్య ఉండే అవకాశం ఉందని బీబామ్ అంచనా వేసింది. అసలు ధర ఎంతనేది నవంబర్ 24న తేలనుంది.

Read more Photos on
click me!

Recommended Stories