ఈ రెండు ఫోన్‌లలో స్నాప్‌డ్రాగన్ 732 జి ప్రాసెసర్, 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. వీటిలో మోటో జి60 108 మెగాపిక్సెల్ కెమెరా తో వస్తుంది.మోటో జి60, మోటో జి40 ఫ్యూజన్ ధరమోటో జి60 6 జిబి ర్యామ్, 128 జిబి స్టోరేజ్ ధర రూ .17,999. ఈ ఫోన్ డైనమిక్ గ్రే, ఫ్రాస్టెడ్ షాంపైన్ కలర్ అనే రెండు కలర్ వేరియంట్లలో లభిస్తుంది. మీరు ఐసిఐసిఐ బ్యాంక్ కార్డుతో కొనుగోలు చేస్తే రూ .1,500 తగ్గింపు లభిస్తుంది. ఏప్రిల్ 27న మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లిప్‌కార్ట్‌లో సేల్స్ అందుబాటులోకి వస్తాయి.
మోటో జి40 ఫ్యూజన్ 4 జిబి ర్యామ్, 64 జిబి స్టోరేజ్ ధర 13,999 రూపాయలు. 6 జీబీ ర్యామ్‌తో 128 జీబీ స్టోరేజ్ ధర రూ .15,999. ఈ ఫోన్ డైనమిక్ గ్రే, ఫ్రాస్ట్డ్ షాంపైన్ కలర్‌లో కూడా లభిస్తుంది. మే 1 నుండి ఫ్లిప్‌కార్ట్ ద్వారా సేల్స్ ప్రారంభమవుతాయి.
మోటో జి60 స్పెసిఫికేషన్లుమోటో జి60లో ఆండ్రాయిడ్ 11, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేటుతో 6.8-అంగుళాల ఫుల్ హెచ్‌డి ప్లస్ డిస్ ప్లే, స్నాప్‌డ్రాగన్ 732జి ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్ 128 జీబీ వరకు స్టోరేజ్ ఆప్షన్ ఇంకా మెమరీ కార్డ్ సహాయంతో 1 టిబి వరకు పెంచుకోవచ్చు. ఈ ఫోన్‌లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ తో ప్రైమరీ లెన్స్ 108 మెగాపిక్సెల్స్,రెండవ లెన్స్ 8 మెగాపిక్సెల్స్ అల్ట్రా వైడ్, మూడవ లెన్స్ 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. టర్బోపవర్ పవర్ కి సపోర్ట్ చేసే 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. కనెక్టివిటీ కోసం బ్లూటూత్ 5.0, 3.5 ఎంఎం ఆడియో జాక్, వై-ఫై, ఎన్‌ఎఫ్‌సి, యుఎస్‌బి టైప్-సి పోర్ట్, రియర్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉన్నాయి.
మోటో జి40 ఫ్యూజన్ ఫీచర్లుమోటో జి40లో ఆండ్రాయిడ్ 11, 6.8-అంగుళాల పూర్తి హెచ్‌డి ప్లస్ డిస్ ప్లే, 120Hz రిఫ్రెష్ రేటు, హెచ్‌డిఆర్ 10 డిస్ ప్లే సపోర్ట్ అందించారు. ఈ ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 732జి ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ఉన్నాయి. మెమరీ కార్డ్ సహాయంతో 1 టీబీకి పెంచుకోవచ్చు. దీనికి మూడు బ్యాక్ కెమెరాలు ఉన్నాయి, ఇందులో ప్రైమరీ లెన్స్ 64 మెగాపిక్సెల్స్,రెండవ లెన్స్ 8 మెగాపిక్సెల్స్ అల్ట్రా వైడ్, మూడవ లెన్స్ 2 మెగాపిక్సెల్స్ డెప్త్ సెన్సార్, 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. టర్బోపవర్ 20 ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. కనెక్టివిటీ కోసం బ్లూటూత్ 5.0, 3.5 ఎంఎం ఆడియో జాక్, వై-ఫై, ఎన్‌ఎఫ్‌సి, యుఎస్‌బి టైప్-సి పోర్ట్, రియర్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉన్నాయి.