ఈ రోజుల్లో ఫోన్ కొనడం కంటే, ఆ ఫోన్ కి నెల నెలా రీఛార్జ్ చేసుకోవడమే కష్టమైపోతోంది. రీఛార్జ్ ప్లాన్లు చాలా ఖరీదైపోయాయి. అయితే.. ఈ దీపావళి వేళ ఎయిర్ టెల్, జియో, వీఐ రీఛార్జ్ ప్లాన్లు మళ్లీ చౌకగా మారనున్నాయి. టెలింకాం కంపెనీలు కొత్త సంస్కరణనలు చేపట్టాలని అనుకుంటున్నాయి. ప్రైవేటు కంపెనీల డిమాండ్లను కనుక ప్రభుత్వం నెరవేర్చినట్లయితే అదనపు భారాన్ని తగ్గించే అవకాశం ఉంటుంది.
జులైలో ఎయిర్ టెల్, జియో, వొడాఫోన్, ఐడియా రీచార్జ్ ప్లాన్ ల ధరలను పెంచాయి. ఆ తర్వాత గణనీయమైన మార్పు వచ్చింది. ఈ ధరలను తట్టుకోలేక చాలా మంది వినియోగదారులు బీఎస్ఎన్ఎల్ ని ఎంచుకోవడం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే.. ఈ టెలికాం కంపెనీలు కూడా తమ ధరలను మార్చాలని అనుకుంటున్నాయట.