మరోసారి ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, మెసెంజర్ డౌన్.. ట్విట్టర్‌లో యూజర్ల మీమ్స్‌ వర్షం..

First Published | Nov 5, 2021, 6:49 PM IST

సోషల్ మీడియా(social media) దిగ్గజం మెటా(meta)లోని ప్రముఖ యాప్‌లు బుధవారం మధ్యాహ్నం 1.45 నుండి మూడు గంటల పాటు స్తంభించింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వినియోగదారులకు ఆన్‌లైన్‌ సేవలలో అంతరాయం ఏర్పడింది. అయితే సాయంత్రం 5 గంటల తర్వాత ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, మెసెంజర్ సేవలు పునరుద్ధరించింది. 

ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ సేవలు ఒక్క నెల వ్యవధిలో రెండోసారి నిలిచిపోయాయి. అంతకుముందు అక్టోబర్ 4న ఈ రెండు యాప్‌ల డొమైన్ నేమ్ సిస్టమ్ (DNS)లో సమస్య కారణంగా ఏడు గంటల పాటు షట్ డౌన్ అయ్యింది. 

అయితే ఈ మూడు యాప్‌ల సేవల అంతరాయనికి స్పష్టమైన కారణం కనుగొనలేదు. డౌన్‌డెటెక్టర్‌లో అతిపెద్ద సమస్య ఇన్‌స్టాగ్రామ్ నుండి వచ్చింది. ఫేస్‌బుక్ క్లౌడ్‌ఫ్లేర్‌ని ఉపయోగించదు, కానీ ప్రపంచంలోనే అతిపెద్ద డి‌ఎన్‌ఎస్ రిజల్యూర్‌లపై నడుస్తుంది. డి‌ఎన్‌ఎస్ సిస్టమ్ లోపం కారణంగా ఈ సైట్‌లు షాట్ అయ్యాయి అయితే క్లౌడ్‌ఫ్లేర్ కూడా దాన్ని రిపేర్ చేయడానికి ప్రయత్నించింది. 
 

ఫేస్‌బుక్.కం (facebook.com) వంటి డొమైన్ పేర్ల ద్వారా మానవ సమాచారం ఆన్‌లైన్‌లో ట్రాన్స్మిట్ చేసినప్పుడు, డి‌ఎన్‌ఎస్ దానిని కంప్యూటర్‌లలో ఉపయోగించడానికి ఐ‌పి అడ్రస్ గా మారుస్తుందని క్లౌడ్‌ఫ్లేర్‌లో ఇంజనీరింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఉస్మాన్ ముజఫర్ చెప్పారు. మనకు అర్థమైనంత వరకు ఇది సైబర్ దాడి కాదు, కేవలం టెక్నికల్ లోపం అని అన్నారు.

ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సప్  సర్వర్ డౌన్-అప్ లేదా సమస్య  ఏర్పడటం ఇదేం మొదటిసారి కాదు. సరిగ్గా నెల రోజుల క్రితం అక్టోబర్ 4న కూడా ఇలాంటి సమస్య ఎదురైంది. ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 4 (భారత కాలమానం ప్రకారం) రాత్రి 9.15 గంటల ప్రాంతంలో ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ సర్వర్లు అకస్మాత్తుగా డౌన్ అయ్యాయి. దీంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది.

Latest Videos


facebook apple

దాదాపు ఆరు గంటల తర్వాత వినియోగదారులు ఈ మూడు ప్లాట్‌ఫారమ్‌లను ఉపయోగించలేకపోయారు. అయితే తరువాత రోజు అక్టోబర్ 5 మంగళవారం తెల్లవారుజామున 4.30 గంటలకు ఫేస్‌బుక్ సేవల పునరుద్ధరణ గురించి ట్వీట్ ద్వారా తెలియజేసింది. దీనితో పాటు వినియోగదారులకు కలిగిన అసౌకర్యానికి కంపెనీ క్షమాపణలు కూడా చెప్పింది. 

సేవలు పునరుద్ధరించిన తర్వాత  వాట్సాప్ అధికారిక హ్యాండిల్ ట్వీట్ చేయడం ద్వారా దీనికి సంబంధించిన సమాచారాన్ని ఇచ్చింది. వాట్సాప్ సేవలు నెమ్మదిగా పునరుద్ధరిస్తోందని, మేము చాలా జాగ్రత్తగా ఈ దిశలో వెళుతున్నామని తెలిపింది. కొంతకాలంగా వాట్సాప్ ఉపయోగించలేకపోయిన వారందరికీ క్షమాపణలు కోరుతున్నాము. మీ అందరి సహనానికి ధన్యవాదాలు అంటూ ట్వీట్ లో తెలిపింది.
 

సేవలు నిలిచిపోయిన తరువాత  ఫేస్‌బుక్, వాట్సాప్ ఒక ప్రకటన జారీ చేసింది. ఇందులో యాప్ పనిచేయడం లేదని కొంతమంది నుంచి ఫిర్యాదులు అందాయని తెలిపింది. అలాగే మేము దాన్ని పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నాము, వీలైనంత త్వరగా అప్‌డేట్ చేస్తాము. అలాగే  కొంతమంది మా యాప్‌లు, ఉత్పత్తులతో సమస్యలను ఎదుర్కొంటున్నారని మాకు తెలుసు అని ఫేస్‌బుక్ తెలిపింది.  

వెబ్ అండ్ స్మార్ట్‌ఫోన్ రెండింటిలోను 
వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ వెబ్ అండ్ స్మార్ట్‌ఫోన్ రెండింటిలోనూ పని చేయడం ఆగిపోయింది. ఈ సమస్య అన్ని Android, iOS, వెబ్ ప్లాట్‌ఫారమ్‌లలో సంభవించింది. ప్రజలు మెసేజెస్ స్వీకరించడం లేదా పంపడంలో ఈబ్బందులు ఎదురుకొన్నారు. అదేవిధంగా ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో న్యూస్‌ఫీడ్ రిఫ్రెష్‌లో 'కాంట్ రిఫ్రెష్' అనే మెసేజ్ కనిపించింది.

డౌన్‌ డిటెక్టర్‌లో వాట్సాప్ పనిచేయకపోవడంపై ప్రజలు ఫిర్యాదు చేశారు. ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌పై కూడా వినియోగదారులు ఫిర్యాదు చేశారు. ముఖ్యంగా మెసేజ్‌లు పంపడంలో వినియోగదారులు ఇబ్బందులు ఎదురుకొన్నారు. downdetector.com ప్రకారం ఆండ్రాయిడ్, ఐ‌ఓ‌ఎస్ వినియోగదారులు ఈ సమస్యను ఎదుర్కొన్నారు. దాదాపు 50,000 మంది సర్వర్ డౌన్ కావడంపై ఫిర్యాదులు చేశారు. ఈ మూడు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు పనిచేయకపోవడంపై 8.5 లక్షల ట్వీట్లు వచ్చాయి.


ఫేస్‌బుక్‌తో పాటు ఇన్‌స్ట్రాగ్రామ్‌ సర్వీసులు ఆగిపోవడంపై #facebookdown, #instagramdown అనే హ్యాష్‌ ట్యాగ్‌లు నెట్టింట్లో ట్రెండ్‌ అవుతున్నాయి. అయితే దీనిపై "ఫేస్‌బుక్‌ ఈఎంఈఏ కమ్యూనికేషన్‌ మేనేజర్‌ అలెగ్జాండ్రూ వాయిస్కా స్పందించారు. మెసేజింగ్‌ యాప్స్‌ పనిచేయడం లేదని ఫిర్యాదులు అందాయి. బగ్‌ను గుర్తించి త్వరలోనే సేవల్ని అందుబాటులోకి తెస్తామని అన్నారు. మెసేజింగ్‌ సర్వీసులు నిలిచిపోయినందుకు క్షమించండి అంటూ ఇన్‌స్ట్రాగ్రామ్‌ అఫిషియల్‌ అకౌంట్‌ నుంచి బుధవారం అర్ధరాత్రి 1.33గంటలకు మెసేజ్‌ చేశారు. ఆ తరువాత మరోసారి తెల్లవారు జామున 4.34 గంటల ప్రాంతంలో వీఆర్‌ బ్యాక్‌. బగ్‌ను గుర్తించి, సమస్యను పరిష్కరించామంటూ" మెసేజ్‌ చేశారు.  

click me!