వచ్చేస్తోంది ఫాస్టెస్ట్ ఇంటర్నెట్ సర్వీస్: భారతదేశంలో స్పేస్‌ఎక్స్ అనుబంధ సంస్థను ఏర్పాటు..

First Published Nov 5, 2021, 3:32 PM IST

ప్రపంచంలోని అత్యంత సంపన్న పారిశ్రామికవేత్త, బిలియనీర్  ఎలోన్ మస్క్‌(elon musk)కి చెందిన స్పేస్‌ఎక్స్ (spacex)కంపెనీ భారతదేశంలో బ్రాడ్‌బ్యాండ్ రంగంలోకి ప్రవేశించెందుకు సిద్ధంగా ఉంది. అయితే తాజాగా భారతదేశంలో దాని అనుబంధ సంస్థ స్టార్‌లింక్‌ను ఏర్పాటు చేసింది.
 

2 లక్షల యాక్టివ్ టెర్మినల్స్‌తో డిసెంబర్ 2022 నాటికి భారత మార్కెట్లోకి ప్రవేశించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుందని కంపెనీ అధికారి ఒకరు తెలిపారు. అయితే కంపెనీ ప్రస్తుతం ప్రభుత్వ అనుమతి కోసం వేచి చూస్తోంది.

స్పేస్‌ఎక్స్ ఇప్పుడు భారతదేశంలో 100% యాజమాన్య కంపెనీని కలిగి ఉందని కంపెనీ తెలిపింది. దీని పేరు SSCPL అంటే స్టార్‌లింక్ శాటిలైట్ కమ్యూనికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. 

స్పేస్‌ఎక్స్ ని ఎవరు  స్థాపించారు
 స్టార్‌లింక్ ఇంటర్నెట్ సేవలు ఏరోస్పేస్ కంపెనీ అయిన స్పేస్‌ఎక్స్  నియంత్రిస్తుంది. స్పేస్‌ఎక్స్ ను 2002లో ఎలాన్ మస్క్ స్థాపించారు. భారతదేశంలో ఇంటర్నెట్ సేవలను అందించడానికి స్టార్‌లింక్ ఇండియా వెబ్‌సైట్ ప్రత్యక్ష ప్రసారం చేసింది.

ముందుగా బుక్ చేసుకోవడానికి 
నివేదిక ప్రకారం ఇంటర్నెట్ కనెక్షన్ కోసం ప్రీ బుకింగ్ ప్రారంభించినప్పటికీ 2022 ప్రారంభంలో ఇంటర్నెట్ సర్వీస్ పూర్తి కావచ్చు. మీరు https://www.starlink.com/ని సందర్శించడం ద్వారా ఇంటర్నెట్ కనెక్షన్ ప్రీ బుక్ చేసుకోవచ్చు. స్టార్‌లింక్ ఇంటర్నెట్ కోసం ప్రీ-బుకింగ్‌లు ప్రస్తుతం ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై, హైదరాబాద్, బెంగుళూరులో ఓపెన్ గా ఉన్నాయి. బుకింగ్ సమయంలో మీరు లొకేషన్ సమాచారాన్ని కూడా పొందుతారు.

స్టార్‌లింక్ ఇంటర్నెట్‌ను ప్రీ-బుకింగ్ చేయడానికి 99 డాలర్లు  అంటే సుమారు రూ. 7,300 సెక్యూరిటీగా చెల్లించాలి, ఈ పేమెంట్ రూటర్ మొదలైన వాటికి చెల్లించబడుతుంది. చెల్లింపు పూర్తయిన తర్వాత బుకింగ్ మీ ప్రదేశంలో కన్ఫర్మ్ అవుతుంది. అయితే ఈ సెక్యూరిటి డిపాజిట్ 100% తిరిగి చెల్లించబడుతుందని గుర్తుంచుకోవాలి, అంటే మీరు బుకింగ్ చేసిన తర్వాత ఒకవేళ సర్వీస్ వద్దనుకొని ఆలోచనను మార్చుకుంటే లేదా మీరు దానిని రద్దు చేస్తే డబ్బును తిరిగి పొందవచ్చు.

అయితే బీటా టెస్టింగ్ సమయంలో కస్టమర్‌లు 50-150Mbps స్పీడ్‌ని పొందుతారు, అయితే టెస్ట్ పూర్తయిన తర్వాత 300Mbps వరకు స్పీడ్ అందుబాటులోకి వస్తుందని ఎలాన్ మస్క్ చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా స్టార్‌లింక్ ద్వారా ఇంటర్నెట్‌ సర్వీస్ ను అందించే యోచనలో ఉన్నట్లు ఎలోన్  మస్క్ చెప్పారు.

click me!