కేవలం రూ.200 రీఛార్జ్ చేస్తే చాలు.. రోజూ 2 జీబీ ఫ్రీ డేటా.. వాలిడిటీ ఎన్ని రోజులో తెలుసా.?

First Published Aug 23, 2023, 3:27 PM IST

ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ BSNL కస్టమర్ల  కోసం ఒకదాని తర్వాత ఒకటి పాకెట్ ఫ్రెండ్లీ ప్లాన్‌లను తీసుకొస్తుంది. BSNL  పోర్ట్‌ఫోలియోలో అనేక ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌లు ఉన్నాయి, ఇలాంటివి రిలయన్స్ జియో, వోడాఫోన్ ఇంకా ఎయిర్‌టెల్ లో కూడా లేవు.
 

BSNL ఇలాంటి ఎన్నో  బడ్జెట్ ప్లాన్‌లను అందిస్తోంది. ఇందులో కస్టమర్లు తక్కువ ధరకే అనేక ప్రయోజనాలను పొందవచ్చు. అటువంటి ఒక BSNL రీఛార్జ్ ప్లాన్‌తో కస్టమర్లు డైలీ  హైస్పీడ్ డేటా, ఆన్ లిమిటెడ్ కాలింగ్ సౌకర్యం పొందవచ్చు. కాబట్టి ఈ ప్లాన్ బెనిఫిట్స్ వివరంగా తెలుసుకుందాం... 
 

BSNL రూ.200 ధర లోపు  ఉండే  ఈ ప్లాన్ 30 రోజుల వాలిడిటీతో వస్తుంది. ఈ ధర వద్ద ఇతర నెట్ వర్క్  ప్లాన్లు 23 రోజులు వాలిడిటీ అందిస్తున్నాయి. ఆంతేకాకుండా, BSNL ఈ  ప్లాన్‌తో వినియోగదారులు ఇంటర్నెట్‌ని ఉపయోగించడానికి ప్రతిరోజూ 2GB డేటాను పొందుతారు.
 

ఇది కాకుండా, BSNL ఈ రూ.199 ప్లాన్ తో రోజుకు 100 SMSలను అందిస్తుంది. ఇప్పుడు కాలింగ్ గురించి మాట్లాడితే వినియోగదారులు కాల్స్ చేసుకోవడానికి ఆన్ కాలింగ్ సదుపాయాన్ని పొందుతారు. రిలయన్స్ జియో  రూ.199 ప్లాన్ చూస్తే 23 రోజులు మాత్రమే వస్తుంది.
 

ఈ జియో ప్లాన్ తో రోజుకు 1.5GB డేటాను అందిస్తుంది. ఇది కాకుండా, ప్రతిరోజూ 100 SMSలతో పాటు ప్లాన్‌తో  అన్ని నెట్‌వర్క్‌లకు కాల్స్ చేయడానికి ఆన్ లిమిటెడ్ కాలింగ్ సౌకర్యం కూడా ఉంటుంది.
 

click me!