రియల్‌మీ బడ్జెట్-ఫ్రెండ్లీ 5G స్మార్ట్‌ఫోన్... ఈ ఆకర్షణీయమైన ఆఫర్ అస్సలు మిస్సవ్వకండి..

First Published | Aug 23, 2023, 12:00 PM IST

రియల్‌మీ 11ఎక్స్  5జి స్మార్ట్‌ఫోన్‌ని  ఆగస్టు 23న అంటే నేడు ఇండియాలో విడుదల చేయనున్నట్లు రియల్‌మీ వెల్లడించింది. చాలా మంది స్మార్ట్‌ఫోన్ ప్రేమికులు దీన్ని కొనేందుకు  ఎంతో ఆసక్తి చూపుతున్నారు. ఇలాంటి సమయంలో వినియోగదారులను ఆకర్షించడానికి Realme ఒక ఆఫర్‌ను ప్రకటించింది.
 

రియల్‌మీ 11ఎక్స్  5జి ప్రత్యేక ఫీచర్లు:

Realme 11X 5G ఫోన్‌లో 2x సెన్సార్ జూమ్‌తో కూడిన 64MP బ్యాక్ కెమెరా ఉంది. దీనికి షార్ప్  అండ్  డిటైల్ జూమ్ సామర్ధ్యం ఉంది. ఇంకా 33W ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్‌తో 5000 mAh బ్యాటరీ ఇచ్చారు. ఫోన్‌ను 50% వరకు ఛార్జ్ చేయడానికి  కేవలం 29 నిమిషాలు సరిపోతుంది.

Realme 11X మొబైల్ octa-core MediaTek ప్రాసెసర్‌తో వస్తుంది. ఈ 5G స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్లలో లభ్యం కానుంది. ఒకదానిలో 6GB ర్యామ్, 128GB స్టోరేజ్ ఉంటుంది. మరో వేరియంట్‌లో 8GB ర్యామ్, 128GB స్టోరేజ్ లభిస్తుంది.


Realme 11X పరిచయ ఆఫర్:

Realme 11X 5G స్మార్ట్‌ఫోన్ ఆగస్ట్ 23న లాంచ్ కానున్నందున, ఈ రోజు సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు Realme.com అండ్ ఫ్లిప్‌కార్ట్‌లలో పరిచయ ఆఫర్‌ను ప్రారంభించాలని రియల్‌మీ యోచిస్తోంది.

6GB ర్యామ్, 128GB స్టోరేజ్ తో Realme 11X 5Gని పరిచయ ఆఫర్‌తో రూ.1,000 వరకు తగ్గింపును పొందవచ్చు. దీనితో పాటు, కస్టమర్‌లు 3 నెలల వడ్డీ లేని EMI మోడ్‌లో కొనుగోలు చేసే సదుపాయాన్ని కూడా  పొందవచ్చు.

8GB ర్యామ్, 128GB స్టోరేజ్ తో  Realme 11X 5G ఫోన్‌ను ఆరు నెలల నో కాస్ట్ EMIతో కూడా  కొనుగోలు చేయవచ్చు.

Latest Videos

click me!