battery Draining Apps:బ్యాటరీని మింగేసే 43 యాప్స్ ఇవే.. వెంటనే వీటిని మీ ఫోన్ నుంచి తీసేయండి.!!

First Published | Aug 22, 2023, 12:07 PM IST

గూగుల్ ప్లే స్టోర్ 43 బ్యాటరీ డ్రైనింగ్ యాప్‌ల లిస్ట్ విడుదల చేసింది. అలాగే ఈ యాప్‌లను వెంటనే తొలగించాలని సూచించారు.
 

McAfee  మొబైల్ రీసర్చ్  టీం ఈ యాప్‌లను గుర్తించింది. ఈ యాప్స్  Play Store విధానాలను ఉల్లంఘించినట్లు Googleకి   తెలియజేసింది. చాలా యాప్‌లను డెవలపర్‌లు తొలగించగా, కొన్ని అప్‌డేట్ అయినట్లు సమాచారం.
 

ఈ గుర్తించబడిన యాప్‌లు లేదా ఈ యాప్‌లలో ఏదైనా ఫోన్లలో ఉంటె వెంటనే వాటిని తీసివేయాలని కోరారు. మీ స్మార్ట్‌ఫోన్‌లో ఈ యాప్‌లు ఉంటే ముందుగా వాటిని తొలగించాలని, ఆండ్రాయిడ్ యూజర్లు మొబైల్ స్క్రీన్ ఆఫ్ చేసినప్పటికీ, బ్యాటరీ లైఫ్ తగ్గిపోతుందని తెలుసుకోవాలని కోరారు.
 

Latest Videos


మొబైల్ డేటాను ఉపయోగించే అవకాశం ఉన్నందున మొబైల్‌ల నుండి కొన్ని సందేహాస్పద యాప్‌లను తొలగించాలని వారు ప్రజలను హెచ్చరించారు. డివైజ్  ఐడిల్ లో  ఉన్నప్పుడు యాడ్స్  చూపించే 43 యాప్‌ల కలెక్షన్  McAfee  సెక్యూరిటీ  టీం కనుగొన్న తర్వాత ఈ హెచ్చరిక వచ్చింది.
 

ఈ ప్రమాదకరమైన ఇన్నోవేషన్ నేరుగా Google నియమాలను ఉల్లంఘిస్తుంది ఇంకా  Google Play డెవలపర్ విధానానికి విరుద్ధం. ఈ నిబంధనలు ఉన్నప్పటికీ, కొంతమంది డెవలపర్‌లు యూజర్  అనుమతి లేకుండా యాడ్ క్లిక్‌లను రూపొందించడానికి ఈ లొసుగును ఉపయోగించుకునేందుకు  ప్రయత్నించారు.
 

Google Play Store నుండి ఈ యాప్‌లను తీసివేసినప్పటికీ, దాదాపు 2.5 మిలియన్ల మంది వినియోగదారులు తీసివేయడానికి ముందే వాటిని డౌన్‌లోడ్ చేసుకున్నారు. TV/DMP ప్లేయర్, మ్యూజిక్ డౌన్‌లోడర్, న్యూస్ అండ్ క్యాలెండర్ అప్లికేషన్‌లు McAfee ద్వారా గుర్తించబడ్డాయి.
 

కొత్త యాప్‌లను డౌన్‌లోడ్ చేసేటప్పుడు జాగ్రత్త వహించాలని McAfee సలహా ఇస్తుంది. ఏదైనా యాప్‌ని ఇన్‌స్టాల్ చేసే ముందు సాఫ్ట్‌వేర్ రిక్వెస్ట్  పర్మిషన్స్ చెక్ చేయడం అవసరం. పాత మొబైల్ లేదా పాడైపోయిన బ్యాటరీ వల్ల కూడా ఈ సమస్య రావచ్చు.
 

అందువల్ల, తెలియని యాప్‌లకు పర్మిషన్ ఓకే చేసేటప్పుడు వినియోగదారులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అప్లికేషన్ పని చేయడానికి అవసరమైన పర్మిషన్  మాత్రమే ఓకే చేయండి. దాదాపు 3 మిలియన్ యాప్‌లు, గేమ్‌లతో సహా  హానికరమైన యాప్‌లు అండ్  పాలసీ-ఉల్లంఘించే సాఫ్ట్‌వేర్ చొరబాట్లను నిరోధించడంలో ఈ ప్లాట్‌ఫారమ్ పోరాడుతోంది.
 

click me!